Date : 04 October 2026
Posted By : INBTV

ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. సీన్ కట్ చేస్తే..

ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. సీన్ కట్ చేస్తే.. ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. సీన్ కట్ చేస్తే.. విద్యార్థులకు నీతి, ఆదర్శాలను బోధిస్తూ, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. నమ్మకమే పెట్టుబడిగా చిట్టీలు, డైలీ కలెక్షన్ల పేరుతో కోట్లు వసూలు వసూలు చేశాడు. గురుబ్రహ్మ అని నమ్మి లక్షలాది రూపాయలు చేతిలో పెట్టిన వందలాది పేద, అమాయక ప్రజలను నట్టేట ముంచాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మొదట్లో ఇటుక బట్టీలు, డెయిరీ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. ప్రభుత్వ ఉద్యోగం, సమాజంలో ఉన్న గౌరవాన్ని ఆసరాగా చేసుకుని, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో చిట్టిల దందాకు తెర లేపాడు. తన భార్య అనూష సహకారంతో సూర్యాపేట రూరల్, చివ్వెంల పరిసర ప్రాంతాల్లో చిట్టీల వ్యాపారం, డైలీ కలెక్షన్లు ప్రారంభించాడు. స్థానికుల నుండి ప్రతిరోజూ రూ.2 లక్షల వరకు డైలీ కలెక్షన్లు, అప్పుల రూపంలో వసూలు చేశాడు. కొద్ది రోజుల పాటు చిట్టీల వ్యాపారం సజావుగానే సాగింది. నెలనెలా డబ్బులు వసూలు చేయడం, పాట పాడుకున్న వారికి నమ్మకంగా డబ్బులు ఇవ్వడంతో వ్యాపారం మరింత పెరిగింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా లక్షలాది రూపాయల విలువైన పలు చిట్టీలను ఆయన నడిపాడు. ప్రభుత్వ టీచరే కదా, ఎక్కడికి పోతాడు అనే నమ్మకంతో తోటి ఉద్యోగులు, వ్యాపారులు, అమాయక తండా ప్రజలు తమ కష్టార్జితాన్ని రాజు చేతిలో పెట్టారు.బాధితులు నిలదీయడంతో గుట్టురట్టు..చిట్టీల గడువు పూర్తికావడం, బాధితులు పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో రాజు అసలు రంగు బయటపడింది. బాధితులు తమ డబ్బుల కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితులకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో సహా పరారయ్యాడు. తాము కష్టపడి దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగి కదా.. ఎక్కడికి పోతాడు అని నమ్మాం, మా పిల్లల పెళ్లిళ్ల కోసం దాచిన డబ్బును ఇలా ముంచేస్తాడనుకోలేదు’’ అని కొందరు బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరకు బాధితులంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు.. బాధితుల వివరాలు.. చిట్టీలకు సంబంధించిన లెక్కలు.. నగదు ఎక్కడికి వెళ్లిందన్న అంశాలపై ఆరా తీస్తున్నారు