Date : 15 November 2026
Posted By : INB

వరదయ్యపాలెంలో దారుణం.. చెత్తబుట్టలో నవజాత శిశువు

వరదయ్యపాలెంలో దారుణం.. చెత్తబుట్టలో నవజాత శిశువు

ఐ ఎన్ బి టైమ్స్, వరదయ్యపాలెం, నవంబర్ 15:

వరదయ్యపాలెంలో అత్యంత దారుణమైన, హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మానవత్వాన్ని మరచిన ఓ కసాయి తల్లి, అప్పుడే పుట్టిన నవజాత శిశువును నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయింది.

​చెత్తబుట్టలో నుండి పసికందు ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి దగ్గరకు వెళ్లి చూడగా, రక్తపు మరకలతో పాటు ఒంటినిండా పురుగులు పట్టిన స్థితిలో శిశువు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు మానవత్వం చాటుకుంటూ పసికందును హుటాహుటిన వరదయ్యపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

​ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది శిశువు ఒంటిపై ఉన్న పురుగులను తొలగించి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కన్నపేగును ఇలా చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిన ఆ తల్లి తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement