తమిళనాడు దిండివనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

INBINB
24 Nov, 26
 0  11
తమిళనాడు దిండివనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడు విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలో కన్నిగాపురం బస్టాప్ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరదయ్యపాలెం మండలం పాదిరికుప్పం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు లక్ష్మీపతి అలియాస్ కొట్టం గురవయ్య(33), గుమ్మడి పూండి ప్రాంతం పెరియాపాల్యంకు చెందిన వ్యాన్ డ్రైవర్ రాజేంద్రన్(24) అక్కడికక్కడే మృతి చెందారు.  దీంతోపాటు మరో 13 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ రోడ్డు ప్రమాదం సోమవారం తెల్లవారుజామున సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి .అయ్యప్ప భక్తులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకొని వ్యాన్లో తిరుగు ప్రయాణమయ్యారు.దిండివనం సమీపంలో కన్ని గాపురం వద్ద విశ్రాంతి కోసం అయ్యప్ప భక్తుల వ్యాను రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలోతేని నుంచి చెన్నై వైపు వెళ్తున్న ప్రైవేటు ఓమ్నీ బస్సు కన్నిగాపురం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టిన తర్వాత లారీ ముందు విశ్రాంతి కోసం నిలిపి ఉంచిన అయ్యప్ప భక్తుల వ్యాన్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు వ్యాన్ బోల్తాపడింది.అదే సమయంలో వ్యాన్ పక్కన నిలబడి ఉన్న అయ్యప్ప భక్తుడు వాహనం కింద చిక్కుకుపోవడం,వ్యాన్‌లో ఉన్న డ్రైవర్ కూడా బయటకు ఎగిరిపడి వాహనం కింద చిక్కుకుని అక్కడ అక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న తమిళనాడు. మైలాం పోలీసులు,దిండివనం అగ్నిమాపక,రక్షణ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం108 అంబులెన్సుల ద్వారా విల్లుపురం జిల్లా ముండియంపాక్కంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై మైలాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బస్సు డ్రైవర్ అదుపుతప్పడానికి గల కారణాలు, ప్రమాద సమయంలో వాహనాల పరిస్థితి తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు.శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని సంతోషంగా స్వగ్రామానికి తిరిగి వస్తున్న భక్తుల ప్రయాణం విషాదాంతంగా మారడంతో భక్తులు,వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.