బొట్టు పెట్టి ఓటు అభ్యర్థిస్తున్న ఇందిరానగర్ ఎంపీటీసీ అభ్యర్థి ఎం. సుజాత
ఐ ఎన్ బి టైమ్స్,వరదయ్యపాలెం, అక్టోబర్ 31: ఇందిరానగర్ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎం. సుజాత వినూత్న రీతిలో ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల గుర్తు ఎయిర్ కండిషనర్ కావడంతో ఆ గుర్తును ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఎం. సుజాత ప్రజల మధ్యకు వెళ్లి తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకుంటూ మద్దతు కోరుతున్నారు. గ్రామంలోని ప్రతి ఓటరును కలవడమే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి ఇందిరానగర్ ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార శైలి, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.