మా మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే: మాస్ లైన్: ప్రకటించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి

- కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన రఘురాం రెడ్డి

మా మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే: మాస్ లైన్: ప్రకటించిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 02: మతతత్వ  బీజేపీ, నిలకడ లేని బీఆర్ఎస్ లను అడ్డుకునేందుకు ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నాo అని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. గురువారం ఆ పార్టీ కార్యాలయానికి సీపీఎం, సీపీ ఐ బల్పర్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి మర్యాద పూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చండ్ర కృష్ణ మూర్తి హాల్ లో జరిగిన సమావేశంలో మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, గుర్రం అచ్చయ్య తదితరులతో కలిసి పోటు రంగారావు మాట్లాడుతూ..విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ని నిలువరించడమే తమ లక్ష్యమన్నారు. రఘురాం రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపిస్తామని ప్రకటించారు. 
ఎంతో మంచి పరిణామం:రఘురాం రెడ్డి 
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం మాట్లాడుతూ..వామపక్షాలు అన్నీ తనకు మద్దతు ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మీ నమ్మకం నిలబెట్టుకునేలా పనిచేస్తానని అన్నారు. 
ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గా ప్రసాద్, నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్, మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాస్ లైన్ నాయకులు ఆవుల అశోక్, ఆవుల వెంకటేశ్వర్లు, పీ డీ ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్, పుడులూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 25

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి