ఉపాధి నిధులను కూడా వదలని జగన్

ఆలోచించి ఓటు వేయండి మర్రిపాక ఉపాధి కూలీల వద్ద ఎన్నికల ప్రచార నిర్వహించిన జ్యోతుల నెహ్రూ

ఉపాధి నిధులను కూడా వదలని జగన్

ఐ ఎన్ బి టైమ్స్ కాకినాడ జిల్లా జగ్గంపేట మే 03: జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథం పై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, గ్రామంలో చెరువు వద్ద 400 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా అక్కడకు వెళ్ళిన జ్యోతుల నెహ్రూ వారి అందరిని ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీ అందరి చల్లని ఆశీస్సులు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాసన్ కూడా గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టిందని కానీ చంద్రబాబు తన ప్రభుత్వం ఏర్పడకుండానే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచిన మహానుభావుడని అన్నారు. ఉపాధి పనులు కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో పని దినాలు కల్పించలేదని ఉపాధి నిధులను కూడా వదలకుండా వేరే పథకాలకు మళ్లించిన ఘనుడు జగన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, బండారు చిన్నబాబు, గద్దె మారుతి, పైలా శివరామకృష్ణ, కాపవరపు నూకా పతి, కాపవరపు ప్రకాశం, రెడ్డి ఆంజనేయులు, కాపవరపు సత్యనారాయణ, కాపవరపు నాగేశ్వరరావు, కాపువరపు శ్రీను, కలికట్ల బాబురావు, దుల్ల అనిల్, కాపవరపు అప్పారావు, కోసన సూర్య ప్రకాశరావు, కోసన అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి