ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వి.పి గౌతమ్ .

 ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి  -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 08: ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర నంద్ మిశ్రా లతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో రిటర్నింగ్ అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ ప్రక్రియకు దగ్గర్లో ఉన్నట్లు, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలన్నారు. పోలింగ్ కు ముందు సైలెన్స్ పీరియడ్ లో నిరంతరం అప్రమత్తంగా వుంటూ, పటిష్ట నిఘా పెట్టాలన్నారు. సీజర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల్లో ప్రతిఒక్కరు సమానమని, ప్రతిఒక్కరికి సమాన అవకాశం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఫంక్షన్ హాళ్లు, గోడౌన్ల తనిఖీలు చేపట్టాలన్నారు. ఎస్ఎస్టి చెక్ పోస్టుల పర్యవేక్షణ చేయాలన్నారు. జనసమ్మద్దం ఉన్న అవాసాల్లో, వీధుల్లో, గల్లీల్లో తిరుగుతూ నిఘా పెట్టాలన్నారు. వాహనాలకు అమర్చిన పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ప్రజల్లో ఎన్నికల పట్ల అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ రోజున ఫ్లయింగ్ స్క్వాడ్ పాత్ర ఎంతో కీలకమని, వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద పహారా చేయాలని ఆయన అన్నారు. పోలింగ్ టర్నోవర్ తక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో పర్యటించి, సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం, ప్రలోభపెట్టడం చేస్తే, క్విక్ రెస్పాన్స్ టీమ్ కి సమాచారం ఇచ్చి, వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టాలని, గూడ్స్ సెక్షన్ లోను తనిఖీలు చేయాలని ఆయన అన్నారు. ఫంక్షన్ హాళ్ళల్లో శుభ కార్యాలు, ఇతర ఫంక్షన్లు కాక, కుల సంఘాల సమావేశాలు, ఫెక్ ఫంక్షన్లు దృష్టికి వస్తే సదరు ఫంక్షన్ హాల్ యజమాని, ఫంక్షన్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 
     వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి మాట్లాడుతూ, ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలని, ఫిర్యాదు పరిష్కారం అవుతుందనే నమ్మకం ఓటర్లలో కల్పించాలని అన్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల సందర్శన చేస్తూ ఉండాలన్నారు. ప్రచార వాహన అనుమతులు తనిఖీ చేయాలన్నారు. వైన్స్, బార్ లపై దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల సందర్శనలు పెంచాలన్నారు.
    వ్యయ పరిశీలకులు శంకర నంద్ మిశ్రా మాట్లాడుతూ, ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలు గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణ కై చర్యలు తీసుకోవాలని అన్నారు.  సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై ఈ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో సమీక్షించారు. ఈ సమావేశంలో కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, వ్యయ నోడల్ అధికారి, జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి