*ఘోరం.. ఫోన్, బంగారం కోసం కన్నబిడ్డను అమ్మేశారు!*

30 Sep, 26
 0  20
*ఘోరం.. ఫోన్, బంగారం కోసం కన్నబిడ్డను అమ్మేశారు!*

*ఘోరం.. ఫోన్, బంగారం కోసం కన్నబిడ్డను అమ్మేశారు!*


ఐ ఎన్ఛ. బి టైమ్స్ డెస్క్,  సంభాజీనగర్: కన్న ప్రేమకు మచ్చ తెచ్చేలా ఓ జంట తమ నెలరోజుల పసికందును రూ.1.20 లక్షలకు విక్రయించిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. లభించిన సమాచారం ప్రకారం, బిడ్డను విక్రయించిన డబ్బుతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

బిడ్డను విక్రయించిన అనంతరం కేవలం 48 గంటల్లోనే నాందేడ్ మీదుగా తెలంగాణకు తరలించి, పలువురి చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. చివరికి బిడ్డను హైదరాబాద్‌లో రూ.3.50 లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. 

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి తల్లిదండ్రులతో పాటు మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి పసికందును సురక్షితంగా రక్షించి, ప్రస్తుతం సంబంధిత అధికారుల సంరక్షణకు అప్పగించినట్లు సమాచారం. కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.