వివాహేతర సంబంధం.. భార్య ముక్కు కోసేసిన భర్త!
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా హర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. మరొక వ్యక్తితో సంబంధం ఉందనే కోపంతో భార్య నీలమ్‌పై భర్త దాడి చేసి, ఆమె ముక్కు కోసేశాడు వివాదం సమయంలో ప్రియుడి సోదరుడిపై కూడా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు...