కాంగ్రెస్ గెలిస్తే త్రిబుల్ ఆర్ టాక్స్ బీజేపీ గెలిస్తే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర వినోద్ రావు

ఖమ్మం టూ టౌన్ లో రోడ్ షోకు విశేష స్పందన ఉత్సాహంగా పాల్గొన్న సీనియర్ నేత దేవకి వాసుదేవ రావు

కాంగ్రెస్ గెలిస్తే త్రిబుల్ ఆర్ టాక్స్   బీజేపీ గెలిస్తే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర వినోద్ రావు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 03 :  కాంగ్రెస్ ఖమ్మం లో గెలిస్తే త్రిబుల్ ఆర్ టాక్స్ ఉంటుందని, బీజేపి గెలిస్తే ఖమ్మం సమగ్ర అభివృద్ధి జరుగుతుందని పార్టీ  పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఆయన శుక్రవారం ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ సెంటర్ లో సందడి సందడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. డబ్బు వాయిద్యాల, కోలాటాలు మధ్య  వినోద్ రావుకు పార్టీ శ్రేణులు, పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడుతూ - మండు టెండను లెక్క చేయకుండా రోడ్ షో కి వచ్చినందుకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని ఆన్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో మోడీ నిధులతోనే సెంట్రల్ లైటింగ్, పార్కులు, రోడ్లు అభివృద్ధి జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలతో అధికారులకు అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి తమ్ముడు టికెట్ కోసం ట్రై చేసి ఫలించక చివరకు వియ్యంకుడికి ఇప్పించుకున్నారని విమర్శించారు. ఆయన మహబూబాబాద్ కు చెందినవారని మన సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తాను లోకల్ అనే, ఇదే పార్లమెంట్ పరిధిలో అశ్వరావుపేట నియోజకవర్గంలో ఓటు ఉందని తెలిపారు. గత పది ఏళ్ల ఎంపీ పనితీరులో విద్య, వైద్యం, ఉపాధి లేదని మండిపడ్డారు. తెలంగాణలోని పెద్ద నగరం అంటున్నారు ఖమ్మం అభివృద్ధి ఏది అన్నారు. ఖమ్మంలో సరైన ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖమ్మం అభివృద్ధి చెందితే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏముందన్నారు. ఎన్ ఆర్ ఐ లను ఎందుకు ప్రోత్సహించడం లేదన్నారు. ఎన్నికల రోజు బ్యాలెట్ లో  నాలుగో నెంబర్ కేటాయించారని ఓటర్లు ఈ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్రంలో 400 సీట్లతో మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో అవినీతి జరిగిందని ఆరోపించిన నేతలు అక్కడ ఉండి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి అధికార దర్పం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నామాలు పెడతారని విమర్శించారని మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చి ఎంపీ చేశారని ఆరోపించారు. ఈ ఐదేళ్లు ఎంపీగా తానేమి సాధించారో  చెప్పాలని నామా ను ప్రశ్నించారు. కాంగ్రెస్ లో భార్య,  తమ్ముడు , కుమారుడు పోయి వియ్యంకుడు కు కు సీటు ఇప్పించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే వారి వ్యాపారాలు, కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించుకుంటారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, టౌన్ ప్రెసిడెంట్ టి భద్రం, జిల్లా సెక్రటరీ వేల్పుల సుధాకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మాచర్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి