చండ్రుగొండ మండలంలో రఘురాం రెడ్డి ప్రచారం, పరామర్శ

చండ్రుగొండ మండలంలో రఘురాం రెడ్డి ప్రచారం, పరామర్శ

ఐ ఎన్ బి టైమ్స్ చంద్రుగొండ మే 05 : ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలిసి తిప్పెనపల్లి, అయిన పాలెం ఎస్సీ కాలనీ, రవికం పాడు లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలకు కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి హస్తం గుర్తుపై ఓటేయించాలని కోరారు. తిప్పెనపల్లిలో తనను కలిసిన మైనార్టీ మహిళలతో మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిశాక అర్హులందరికీ పక్కా ఇళ్ళు మంజూరు అవుతాయని తెలిపారు. చండ్రుగొండలో ఎస్ కే. బషీర్ ఇంట వివాహం జరగనుండగా.. ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తిప్పెనపల్లిలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి రాజబోయిన యశ్వంత్ ఇంటికి వెళ్లి.. అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కారేపల్లి శేఖర్, బోజ్యా నాయక్, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ధారావత్ రామారావు, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 1

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి