నేడు ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక...!

వియ్యంకుడి విజయం కోసం వెంకటేష్ ప్రచారం...!

నేడు ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక...!

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 07 : సినీ హీరో విక్టరీ వెంకటేష్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు టూర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.  పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రామసహాయం రఘు రాం రెడ్డి కి వియ్యంకుడు కావడంతో ఆయన గెలుపు కోసం ప్రచారం చేసేందుకు వస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5గంటలకు ఖమ్మం మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షో లో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 8గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్ లో జరిగే పుర ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెంకటేష్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై వెంకటేష్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి