ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సిద్ధం... ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్

ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సిద్ధం... ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మే 08 : మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్  జిల్లా పోలీస్ అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు.ఈ సమావేశం లో జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్వహించవలసిన విధులు, బాధ్యతలు గురించి సమీక్షా నిర్వహించడం జరిగింది. ఎన్నికలకు ముందు 72 గంటల నుండి చేయవలసిన కాసరత్తుల గురించి అధికారులకు వివరించారు. ఎన్నికల ప్రక్రియ మొదలయినా సమయం నుండి బాలట్ బాక్సులు సంరక్షణ, కౌంటింగ్ , ఫలితల వెల్లడి వరకు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని జిల్లా ఎస్పీ అన్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణకు ఆటంకాలు లేకుండా ఉండేలా పోలీసు సిబ్బందిని నియమించాలని అన్నారు.. ఓటింగ్ కు అవసరమయ్యే సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేర్చేలా బందోబస్తు చేపట్టలన్నారు . పోలింగ్ తో పాటు ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు రోజున కట్టుదిట్టమైన భద్రత కల్పించేలా పోలీస్ శాఖ కార్యాచరణ గురించి వివరించారు.  జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలను పోలీస్ శాఖ గుర్తించింది గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవల దృష్ట్యా వీటిని ఎంపిక చేశారు. ఆయా కేంద్రాల పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు. రౌడీలు పాత నేరస్తులు గొడవలకు పాల్పడే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి . తహీశీల్దారుల ఎదుట వారిని బైండోవర్ చేయాలాన్నారు.. నిత్యం వారి కదలికల పై దృష్టి సారించాలని అన్నారు.. స్థానిక సీఐలు, ఎస్సైలు గ్రామాలలో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక పోలీసుల సహకారంతో కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తారు. ఇప్పటికే చేరుకున్న కేంద్ర బలగాలకు తోడు సర్కిల్ కేంద్రాల పరిధిలోకి అదనపు బలగాలతో ఎన్నికలు నీవహించాలని అన్నారు.. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ట్రైనీ ఐ పి ఎస్ పండరి చేతన్, మహబూబాబాద్ డిఎస్పీ ఎన్.తిరుపతి రావు, ఏ.ఆర్ డిఎస్పీ విజయ్ ప్రతాప్, సీఐలు, ఎస్. ఐ లు, అధికారులు పాల్గొన్నారు.

Tags:
Views: 12

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి