కంకణబద్ధులై పని చేయాలి ❇️ ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాయబోతున్నాం ❇️ కాంగ్రెస్ మోసంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు ❇️ గడప గడప కు వెళ్లి ప్రజలతో మమేకం కావాలి ❇️ కార్యకర్తలే కధానాయకులు

ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఖమ్మం టూ టౌన్ ఏరియా కార్యకర్తల సమావేశంలో బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర*

కంకణబద్ధులై పని చేయాలి   ❇️ ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాయబోతున్నాం   ❇️ కాంగ్రెస్ మోసంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు   ❇️ గడప గడప కు వెళ్లి ప్రజలతో మమేకం కావాలి   ❇️ కార్యకర్తలే  కధానాయకులు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 02 : కాంగ్రెస్ మోసం వల్ల ప్రజల్లో మార్పు వచ్చింది.. ప్రతి కార్యకర్త కంకణబద్ధులై గడప గడపకు వెళ్లి తలుపు తట్టి ప్రజలతో ఏకమై మంచి మెజార్టీతో గెలిపించాలని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా. కార్యాలయంలో గురువారం జరిగిన ఖమ్మం టూ టౌన్ ఏరియా పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సమయం తక్కువుగా ఉన్నందున అందరం కష్టపడి పని చేద్దామని చెప్పారు.జిల్లాలో  కేసీఆర్ సభలు సక్సెస్ అయ్యాయని, ప్రజలు ఆలోచనలో పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ చేసిన మోసంపై ప్రజల్లో విస్తృత చర్చ నడుస్తోందని పేర్కొన్నారు.మంచి వాతావరణం ఉందని,  బూత్ స్థాయిలో రాత్రిo బవళ్ళు కష్టపడి పని చేయాలన్నారు. కార్యకర్తలే కదానాయకులని కష్టించి పని చేస్తే టూ టౌన్ లో మంచి మెజార్టీ ఖాయమన్నారు.
  పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ నామ నాగేశ్వరరావు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. 13 న జరిగే ఎన్నికల్లో చరిత్ర తిరగరాయబోతున్నామని చెప్పారు.కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించి, ఆలోచనలో పడ్డారని, వారిని వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో కలిసి ఓట్లు రాబట్టాలని అన్నారు ప్రజలు,కార్యకర్తల వల్లే నాయకులకు పదవులని అన్నారు పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుని, ప్రజల్లో ఎదగాలన్నారు . రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లను గెలవబోతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ సభలకు వచ్చిన జనాన్ని చూసి కాంగ్రెస్ కు వణుకు పుట్టిందన్నారు. అన్ని వర్గాల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రతి ఇంటికి వెళ్లి వారిని కదిలించాలని అన్నారు. ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలని, వారితో కలిసి పని చేస్తే నామ మంచి మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా ప్రయోజనాలు నెరవేరాలన్నా నామ నాగేశ్వరరావు గెలుపు తప్పనిసరన్నారు. నామ గెలిస్తే ఇక్కడే ప్రజల మధ్య ఉంటారని, కానీ ఆ పార్టీ అభ్యర్థి  ఎక్కడుంటారో తెలియని దుస్థితి నెలకొందన్నారు.ఈసీ ద్వారా కేసీఆర్ కు నోటీస్ ఇప్పించి, కావాలనే ఆయన్ని 48 గంటల పాటు మాట్లాడకుండా నిర్బంధం చేసారని పేర్కొన్నారు. బీసీ కి రెండోసారి రాజ్యసభ ఇచ్చి గౌరవించిన కేసీఆర్ రుణాన్ని బీసీలంతా తీర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం , బుర్రి వెంకట్, పొన్నం వెంకటేశ్వర్లు,వెంకటరమణ , మోతారపు సుధాకర్, దోరేపల్లి శ్వేత, పగడాల శ్రీదేవి ,వినయ్ ,  పార్థసారధి, తాజుద్దీన్ , తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 36

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి