ముగ్గురి కాంబినేషన్ సూపర్ హిట్  సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం 

ముగ్గురి కాంబినేషన్ సూపర్ హిట్   సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం 

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం భీమిలి ఏప్రిల్ 10 :  అన్నవరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలోఆయన మాట్లాడారు.టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో పేద ప్రజానీకానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టిడిపి. రాబోయే టిడిపి ప్రభుత్వం హయంలో ఇప్పుడు ఇస్తున్న పథకాలకు మించిన మెరుగైన సంక్షేమాన్ని అందిస్తామన్నారు.. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా సంతకాలు చేసి సంక్షేమానికి గ్యారెంటీ ఇవ్వబోతున్నారు.మోడీ - చంద్రబాబు - పవన్ కల్యాణ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. 2014ను మించిన ఫలితాలు 2024లో రాబోతున్నాయన్నారు.
 రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం భీమిలి. అత్యధిక ఓటర్లతో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన భీమిలిలో సాధించబోయే రీ సౌండ్ మెజారిటీతో రాష్ట్రమంతా భీమిలి వైపు చూడాలని ఆకాంక్షించారు. 2014లో సాధించిన 37 వేల మెజారిటీని తిరగ రాయాలని అన్నవరంలో రాముల వారిని కోరానన్నారు. నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న అన్నవరం గ్రామ ప్రజానీకం గతంలో ఇచ్చిన 1,040 ఓట్ల మెజారిటీ రికార్డు బ్రేక్ చేయాలన్నారు.
ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేసే స్థాయికి దిగజారను. పార్టీ సిద్ధాంతాలు, చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి కోసమే మాట్లాడతా.
ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలను వంచించారు.  చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయడం సీఎం విధ్వంసకర ఆలోచనలను తెలియజేస్తోంది.అభివృద్ధి - సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎన్డీయే కూటమి ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెడుతుంది. కార్యక్రమంలో_టిడిపి ఇంచార్జీ కోరాడ రాజబాబు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్యలో భీమిలిలో గంటా శ్రీనివాసరావు హయంలో జరిగిన అభివృద్దే అభివృద్ధి. ఈ అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిన పాపాన పోలేదు.అన్నారు.మద్య నిషేధం చేస్తానని మహిళలను వంచించిన జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలను విపరీతంగా పెంచి దోపిడీ చేశారన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ నుంచి పలువురు టిడిపిలో చేరారు. అనంతరం గంటా శ్రీనివాసరావు పెద్ద మల్లయ్యపాలెంలో ప్రచారం నిర్వహించారు.

Tags:
Views: 3

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..