మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ను ఓడించాలి--ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్.

మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది.  ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.

ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 25: మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా అన్నారు. ఏఐటీయూసీ భద్రాద్రి జిల్లా కౌన్సిల్ సమావేశం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో జిల్లా ఉపాధ్యక్షులు బండి నాగేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం లో ప్రతి పౌరుడికి విద్య, ఉపాధి, ఆహారం, ఆరోగ్యం, నివాసం, ఉచితంగా అందించాలి అనే ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో ఉన్నదిని ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రతి పరిశ్రమ ప్రభుత్వరంగ పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు ఏర్పాటు చేయాలి అని పోరాడిన ఏఐటీయూసీ కార్మిక సంఘము 1920లో ఆవిర్భవించిందినీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ వస్తుందని అన్నారు. అనేక పోరాటాలు వలన అన్ని రంగాలు ప్రభుత్వ రంగం లో కి రావటం వలన  వేలాది పరిశ్రమలు లో ప్రభుత్వ ఉద్యోగాలు రావటం జరిగింది అని అన్నారు, కోట్ల మంది కార్మికులు ప్రభుత్వ భద్రత తో  పది ఏళ్ల క్రితం వరకు ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యం లో బీజేపీ పార్టీ నేతృత్వం లో మోడీ ప్రధాని అయ్యాక దేశం లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రెవేట్ పరం చెయ్యాలి అని అమ్మకాలు చెయ్యాలి అని నిర్ణయం తీసుకోని ప్రభుత్వ రంగ లో లాభాలు బాట లో ఉన్న నవరత్నాలు పేరున్న పరిశ్రమలు మొత్తం అంబానీ , అదానీ లకు కారు చౌక గా అమ్మకాలు చేసిన దుర్మార్గుడు మోడీ అని దుయ్యబట్టారు, ఈ ప్రెవేట్ విధానం వలన ప్రభుత్వ ఉద్యోగాలు లేని దుస్థితికి భారత్ ప్రజలు చూస్తున్నారు అని అన్నారు, 44 కార్మిక చట్టాలు మొత్తం మార్పులు చేసి ప్రవేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలు మార్పు చేసి కార్మికుల నడ్డి విరిచిన బీజేపీ మోడీ ప్రభుత్భం అని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని, మోడీని ఓడించక పోతే కార్మికులు అందరూ ఉద్యోగాలు లేకుండా కాంట్రాక్టు కార్మికులుగా, ప్రెవేట్ ఉద్యోగులు గా  జీవితం వెళ్లబుచ్చుకోవాల్సిన దృస్తుతి వస్తుంది అని అన్నారు. ప్రజా, కార్మిక వ్యతిరేక ప్రభుత్వంని ఇంటికి పంపాలి అని ప్రతి కార్మికుడు ఉద్యోగి ప్రతి ఇంటికి వెళ్లి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలును తెలియపర్చాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్, జిల్లా నాయకులు కె సారయ్య, కె జమలయ్య, జి నగేష్, అర్ లక్ష్మి నారాయణ, వంగ వెంకట్, మల్లికార్జన్, వీసంశెట్టి పూర్ణ చందర్ రావు, వీరాస్వామి, నజీర్, ఎండి యూసుఫ్, అన్నారపు వెంకటేశ్వర్లు, కుమారి హనుమంతరావు, మణి, విజయ లక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం