పి. డి. ఎస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రోల్స్ పై జరిగే సెమినార్ ను జయప్రదం చేయండి.

పి.డి. ఎస్.యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్..

పి. డి. ఎస్. యూ  ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రోల్స్ పై జరిగే సెమినార్ ను జయప్రదం చేయండి.

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 25: సామాజిక మాధ్యమాలలో మహిళలపై దాడులు విద్యార్థుల పాత్ర అనే అంశంపై ఈ నెల 27న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో సదస్సు నిర్వహిస్తున్నట్లు పిడిఎస్యు  ఖమ్మం జిల్లా  ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ..కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక ప్రత్యక్షంగా  పరోక్షంగా మహిళలపై దాడులు పెరిగాయన్నారు..సామాజిక మాధ్యమాల కేంద్రంగా మహిళలపై విషపూరిత ప్రచారం చేయడం తో పాటు విద్వేషాలు రగిలించడం చేస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాలే లక్ష్యంగా జరిగే విషపూరిత ప్రచారంలో విద్యార్థులు  అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా ఉండే విద్యార్థిని విద్యార్థినిలు మహిళలపై జరిగే అకృత్యాలపై ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా నేటి విద్యార్థి మరియు యువత పై ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళా ల పై జరిగే ట్రోల్స్ మరియు విష ప్రచారంపై ఈ నెల 27న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమనికి ముఖ్యవక్తులుగా ప్రొఫెసర్. గుమ్మడి అనురాధ ప్రిన్సిపాల్ బషీర్బాగ్ లా కాలేజ్ ఓయు, నామాల ఆజాద్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పి.శోభ పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు ,కే .పృద్వి పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజరవుతున్నట్లు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమం లో పి. డి. ఎస్. యూ  నాయకులు సందీప్, శ్రీను, అనిల్, నరేందర్, లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు. .

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దేశంలోని తొలి ప్రయివేటు రైలు   --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్ హైదరాబాద్ మే 08 : కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్...
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని