వినోదన్న విజయానికి స్త్రీ శక్తి శపథం

బీజేపీ మహిళా సదస్సుకు అపూర్వ స్పందన

వినోదన్న విజయానికి స్త్రీ శక్తి శపథం

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 21: అభ్యుదయవాది, సేవా తత్పరుడు, విద్యాధికుడు అయిన ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయం నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత అవసరమని బీజేపీ మహిళా మోర్చా సదస్సులో వక్తలు స్పష్టంచేశారు. అయన విజయం కోసం వచ్చే 20 రోజులు ఎడతెగని కృషి చేయాలని నిశ్చయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు స్వచ్ఛందంగా ఈ సమావేశానికి తరలివచ్చారు. వినోద్ రావు క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం సాయంత్రం జరిగిన రాష్ట్ర మహిళా మోర్చా శక్తి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధా పాటిల్, కార్యదర్శులు విజయా రెడ్డి, నందికొండ గీతారెడ్డి తదితరులు ప్రసంగిస్తూ ఈ సారి ఖమ్మంలో కమలం ఖాయమని అన్నారు. గత ప్రభుత్వాలు 14 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ మాత్రమే ఇస్తే,  మోడీ జీ అధికారంలోకి వచ్చాక 41కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారని శిల్పా రెడ్డి అన్నారు. అనేక పథకాలు ప్రవేశపెట్టి మహిళా లోకం అభ్యున్నతికి పాటుపడుతున్న ఘనత మోడీ జీ దని ఆమె చెప్పారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను నమ్మవద్దని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మహిళలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ మహిళా మోర్చా కన్వీనర్ సరస్వతి, గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ మాట్లాడుతూ మహిళాభ్యున్నతి విషయంలో మోడీ జీ ఘనతను యావత్ భారతం కలకాలం గుర్తు ఉంచుకుంటుందని చెప్పారు. మహిళలకు పది లక్షల డ్వాక్రా రుణాలు తీసుకొచ్చిన ఘనత నరేంద్రమోది కే దక్కుతుంది అన్నారు. మూడు వందల ముప్పై రూపాయలతో రెండు లక్షల మహిళా జీవిత భీమా తీసుకొచ్చిన ఘనత కూడా మోడీ దే అన్నారు. మహిళా మోర్చా శక్తి  సమ్మేళనానికి తరలివచ్చిన వారి ఉత్సాహం చూస్తే బీజేపీ విజయం ఖాయమయ్యిందని తాండ్ర వినోద్ రావు అన్నారు. మోడీ జీ అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టి మహిళాభ్యున్నతికి పాటుపడ్డారని అయన అన్నారు. గత పది సంవత్సరాలలో ఖమ్మం అభివృద్ధిని అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చాయనిచెప్పారు. ఈ సారి మీరు వేసే ఓటు ఖమ్మం అభివృద్ధి వేస్తున్న ఓటు అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పమ్మి అనిత, జిల్లా నాయకురాలు నీలిమ,  అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు.

Tags:
Views: 3

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం