సొంత గూటికి చేరిన గామాలపాడు ఒకటో వార్డ్ మెంబర్

సొంత గూటికి చేరిన గామాలపాడు ఒకటో వార్డ్ మెంబర్

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఏప్రిల్ 24 : సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ నాయకులు.జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, సర్పంచ్ కిచ్చంశెట్టి లక్ష్మి నారాయణ.30 కుటుంబాలను కలిసి యరపతినేని గెలుపుకు తోడ్పాటునందించాలని అభ్యర్థించిన జనసేన నాయకులు.ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అంబటి మల్లి మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కూటమి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు  గెలిపించుకోవడమే ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తుందని అన్నారు. కుతంత్రాలు చేసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు కాలం చెల్లిందని అన్నారు. వైఎస్ఆర్ నాయకులు కులాల మధ్య మతాల మధ్య మరియు కుటుంబాల్లో చిచ్చు పెట్టి చలికాచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తిరిగి పార్టీలోకి చేరిన ఒకటో వార్డు మెంబర్ బత్తుల వెంకయ్య మాట్లాడుతూ మాయమాటలు చెప్పి పార్టీ కండువా కప్పారని, ఒక్క రోజు కూడా అక్కడ ఇమడలేక పోయానని కేవలం స్వార్థ పూరిత రాజకీయాలు చేయడమే లక్ష్యంగా వైయస్సార్ నాయకులు పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీలోకి ఆహ్వానించిన కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోటా మధు గారు, పెదగార్లపాడు గ్రామ వైఎస్ ప్రెసిడెంట్ తిరుమలశెట్టి అంకారావు  తక్కెళ్ళపాడు వార్డ్ మెంబర్ జక్కా సుబ్బయ్య ,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బత్తుల నాగేశ్వరరావు , జనసేన పార్టీ సీనియర్ నాయకులు వంటల వెంకటేశ్వర్లు, గురజాల నరసింహారావు, వెచ్ఛల రవి, మిర్యాల నరసింహారావు ,గామాలపాడు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బత్తుల గిరి ,బొమ్ము రవి ములుకూరి కనకరావు వీర మహిళ విభాగం నాయకురాలు ఇట్టెం వెంకట నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 215

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం