రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.

ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రహదారిని తక్షణమే పునరుద్ధరించాలి--సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం. బారి గేట్లు తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సిపిఐ సిద్ధం.అటవీశాఖ తీరుపై మున్సిపల్ కమిషనరుకు ఫిర్యాదు చేసిన సీపీఐ నేతలు.

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.

ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత అటవీశాఖకు ఎక్కడదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఫారెస్ట్ రోడ్డులో  అటవీశాఖ అక్రమంగా బారి గేట్లు తో రహదారి మూసివేసిన విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు రహదారిని పరిశీలించి స్థానికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ ను కలసి సమస్యను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ పంచాయితీ కాలం నాటి నుండి ప్రజలు నిత్యం తమ పనుల మీద ఈ రహదారిగుంటనే రాకపోకలు సాగిస్తూ ఉంటారని, అటవీశాఖ అధికారులు తమ ఇష్టానుసారంగా రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. తమ పరిదిదాటి అటవీశాఖ అధికారులకు ప్రవర్తించడం తగదుని, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అటివిశాఖ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రహదారిని తక్షణమే పునరుద్ధరించాలిని లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. అటవీశాఖ అధికారుల తీరులో మార్పు రాకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్ కమిషనర్ స్వామికి వినత్పత్రం అందించారు. 24 గంటల్లో అటవీ శాఖ అధికారులు పెట్టిన బారి గేట్లు తొలగించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సిపిఐ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీశంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, దుర్గిరాల సుధాకర్, వీ పద్మజ, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, గాలి పద్మ, లక్ష్మీ, ఎస్ కె పాషా, జకరయ్య, వైఎస్ గిరి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం