కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు సజీవ దహనం

కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు సజీవ దహనం

ఐ ఎన్ బి టైమ్స్ ఉత్తరప్రదేశ్ ఏప్రిల్ 15 : కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌ సికార్‌ జిల్లా ఫతేపూర్‌ షెకావతి లోని ఓ వంతెనపై ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు ఉన్నారు. సమా చారం మేరకు.. వంతెనపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాంప్రతాప్ బిష్ణోయ్ మాట్లాడుతూ కారులో ఉన్న వారందరూ ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌కు చెందిన వారని తెలిపారు. సలాసర్ బాలాజీ టెంపుల్ నుంచి హిసార్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులో ప్రయాణిస్తున్న మృతుల వివరాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫతే పూర్ షెకావతి పోలీసులు మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:
Views: 7

About The Author

INB Picture

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..