రాముడే దేవుడు..

రాముడే దేవుడు..

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాచలం ఏప్రిల్ 16: రాముని మించిన దైవం లేదంటూ యావద్భారత దేశంలో మానవులంతా  రామభజనలతో తన్మయులయ్యే మహాపర్వదినం  శ్రీరామనవమి నేడు.. అంటే ఏప్రిల్ 17న.  పునర్వసు నక్షత్రంతో చైత్ర శుద్ధ నవమి నాడే శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు.  ఆగమశాస్త్రం ప్రకారం దేవతల పుట్టినరోజు నాడే కల్యాణం జరిపించాలి.. శాంతి కల్యాణం అంటారు.  శాంతి స్వరూపిణి అమ్మవారు తోడైతే దేవుడు మరింత శక్తివంతుడు అవుతాడు.  అందుకే దేవాలయాలలో ఏటా కల్యాణాలు జరుపుతుంటారు.  సమస్త మానవాళికి శాంతి చేకూరాలని.  వసంత నవరాత్రులుగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ఉత్సవాలు జరిపి నవమి నాడు సీతారామ కళ్యాణం జరిపితే విశ్వశాంతి, లోకక్షేమం.    ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ లభిస్తుంది.  అందుకే శ్రీరామనవమి నాటి కళ్యాణం తరువాత వాన చినుకులు పడటం  పరిపాటి.  కుదిరితే చాలా పెళ్ళిళ్ళ ముహూర్తాలు శ్రీరామనవమి నాటి సీతారామ కళ్యాణం తరువాతే పెట్టుకుంటారు.  అంతటి ప్రాధాన్యత గల ఈవెంట్ సీతారామ కళ్యాణం.  ఇక చాలా ప్రాంతాల్లో తొమ్మిది రోజుల వేడుకగా శ్రీరామనవమి జరుపుకుంటారు.  తాటాకు పందిళ్ళు, మేళతాళాలు, ప్రత్యేక పూజలు, రామభజనలు, రామాయణ పఠనం, కోలాటాలు, చెక్క భజనలతో ప్రతి రామాలయంలో శ్రీరామ నామ స్మరణతో సందడి వాతావరణం నెలకొంటుంది.  వేదమంత్రాలతో ఆలయ మంటపాలు హోరెత్తుతాయి.  తెల్లని ముత్యాల తలంబ్రాలు శుభప్రదమని కల్యాణ వేడుక తర్వాత వచ్చినవారందరికీ పంచుతారు.  హిందూ వివాహ వ్యవస్థకు పట్టుగొమ్మలు సీతారాములు.  ఆదర్శ దంపతులంటే సీతారాములే.  అనురాగానికి అన్యోన్యతకు మారుపేరు వీరి దాంపత్యం.  మంచితనంలో శ్రీరాముని మించిన వారెవ్వరూ లేరు.  అందుకే రాముడు మంచి బాలుడు అని ఎలిమెంటరీ పాఠశాలలో మనచేత కాపీ రాయించారు.  శ్రీరాముని జీవితమే మనందరికీ ఆదర్శం.  రామాయణం నుంచి నేర్చుకో వలసినవి చాలా ఉన్నాయి.  శ్రీరామునికి సంబంధించి గ్రంథాలు కావ్యాలు కథలు సినిమాలు పాటలు ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి.  ఎంత చదివినా ఎంత విన్నా..  ఇంకా ఇంకా చదవాలని వినాలని అనిపిస్తుంది శ్రీరామ వృత్తాంతం.  నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుందాం.  మనందరికీ శ్రీరాముని ఆశీస్సులు దీవెనలు నిండుగా లభిస్తాయని ఆశిద్దాం.  అందరికీ శ్రీరామనవమి పర్వదినం శుభాకాంక్షలు..  -

Tags:
Views: 8

About The Author

INB Picture

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..