భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాచలం 09:భద్రాచలంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాములవారి ఆలయం ముస్తాబవుతోంది. రంగురంగుల విద్యుత్తుదీపాలు నడుమ ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది..సీతారాముల కల్యాణానికి సుమారు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు భద్రాచలం రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం వసతి, తాగునీరు, భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీతారాముల వివాహానికి హాజరు కావాలని ఇంఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. వేద పండితులు రాజపత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం గవర్నర్‌కు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు..ఈనెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వాగత ద్వారాలతో పాటు క్యూలైన్ల నిర్మాణం చేపట్టారు. 16న నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు భారీస్థాయిలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. 17వ తేదీన ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మిథిలా మండపంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు..

Tags:
Views: 8

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 01: శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా...
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..
మతతత్వ బిజెపి అహంకార బిఆర్ఎస్ లను ఓడించండి
మేడే స్ఫూర్తితో ఫాసిస్టు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం