డా. బి.ఆర్. అంబేద్కర్ కు జిల్లా క‌లెక్ట‌ర్ ఘన నివాళి

డా. బి.ఆర్. అంబేద్కర్ కు జిల్లా క‌లెక్ట‌ర్ ఘన నివాళి

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్ 14 :  భార‌త రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్క‌ర్ కు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున ఘ‌న నివాళుల‌ర్పించారు. అంబేద్క‌ర్ 134వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో ఆదివారం ఉద‌యం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క‌లెక్ట‌ర్.. మ‌హ‌నీయుడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహ‌న్ కుమార్, ఆర్డీవోలు హుస్సేన్ సాహెబ్, భాస్క‌ర రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు, ఇత‌ర అధికారులు కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్య‌మై రాజ్యాంగ నిర్మాత‌కు ఘ‌న‌మైన నివాళుల‌ర్పించారు. ఆయ‌న స‌మాజానికి అందించిన సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ ప‌రిధిలో వివిధ చోట్ల సేవ‌లందించే అధికారులు, ఇత‌ర విభాగాల అధికారులు, క‌లెక్ట‌రేట్లోని వివిధ విభాగాల సూప‌రింటెండెంట్లు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..