దేశం గర్వించే అంబేత్కరులు మళ్ళీ జన్మించాలి..డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు 

 133వ బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు 

దేశం గర్వించే అంబేత్కరులు మళ్ళీ జన్మించాలి..డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు 

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖ  కె. కోటపాడు, ఏప్రిల్,14:  అంబేడ్కర్‌ 133 వ జయంతిని పురస్కరించుకుని ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు  కొనియాడారు. కె.కోటపాడులోని రెల్లి వీధిలో స్థానికుల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ద్వారా అంబేత్కర్ ఆశయాలకు నెరవేరుస్తున్నామని తెలిపారు. అతడు ఐదు వేల సంవత్సరాల ఈ జాతి చరిత్ర గతిని తిరగరాసి, నీకోసం నాకోసం ఈ జాతి సమానత్వం కోసం కడశ్వాస దాక అలుపెరగని పోరాటం చేసి, కేవలం చదువే ఆయుధంగా వివక్షపై రాజీలేని పోరాటం చేసిన మేరునగ ధీరుడు లాంటి అంబేత్కరులు తయారు కావాలని, మళ్ళీ దేశంలో జన్మించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు అంబేద్కర్ వాదులు పాల్గోన్నారు. 

Tags:
Views: 10

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..