డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు 

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ఏప్రిల్ 14 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మండల కేంద్రమైన దుర్గి లో ఎంతో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గి తాహశీల్దార్ రజనీ కుమారి హాజరయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. తదనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆర్థిక నిపుణులు దళితొదారకుడని మహా మేధావి బహుముఖ ప్రగ్యాస్యాలని తెలిపారు. అలాగే భీమ్రావు చిన్న వయసులో ఉన్నప్పుడు తాను చదివే స్కూల్లో మంచినీరు కూడా త్రాగనివ్వలేదు అలా బాల్యమంతా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని రానున్న రోజుల్లో ఎవరు ఇలాంటి అవమానాలను ఎదుర్కోకూడదని తన జీవితాన్నే పణంగా పెట్టి ఎంతో కృషించి సమాజంలో వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కును కల్పించేలా మన దేశ రాజ్యాంగాన్ని రచించి మన అందరి ఆదరణ పొందుతున్న గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. అలాగే దుర్గి వైసీపీ సర్పంచ్ రాయపాటి మాణిక్యం మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ శిల్పిగా పనిచేశారని ప్రముఖ న్యాయవాదిగా ఆర్థిక శాస్త్ర వేత్తగా రాజకీయ నేతగా సంఘసంస్కర్తగా స్వతంత్ర సమరంలో దళితుల నాయకుడిగా ఒక రచయితగా మానవ శాస్త్ర అధ్యయనకర్తగా చరిత్రకారుడిగా పండితుడిగా విప్లవకారుడిగా బౌద్ధ ధర్మ పునరుద్దానడిగా కుల నిర్మూలనకు ఎంతగానో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలిపారు. అలాగే మాట్లాడుకుంటూ పోతే ఆయన గురించి చెప్పటానికి నా వయసు నా అనుభవం సరిపోదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రజనీ కుమారి , దుర్గి సర్పంచ్ రాయపాటి మాణిక్యం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది దుర్గి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:
Views: 1

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..