విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో తనిఖీల్లో భాగంగా బంగారం పట్టివేత

విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో తనిఖీల్లో భాగంగా బంగారం పట్టివేత

 ఐ ఎన్ బి టైమ్స్ విజయనగరం ఏప్రిల్ 14: విజయనగరం పట్టణంలోని కన్యక పరమేశ్వరి టెంపుల్ వద్ద ఏప్రిల్ 12న రాత్రి జిల్లా ఎస్పీ  ఆదేశాలతో వన్ టౌన్ సిఐ  బి.వెంకటరావు ఆధ్వర్యంలో ఎస్సై నవీన్ పడాల్ మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేపడుతూ, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని ఆపి, తనిఖీ చేయగా అతని వద్ద 2.663 కిలోల బంగారు వస్తువులు, రూ.17,95,000/- ల నగదు సీజ్ చేశారు. బంగారు వస్తువులు, నగదుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పంచనామా రిపోర్ట్ వ్రాసి, డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీ మరియు ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటుకు తదుపరి చర్యలు నిమిత్తం పంపినట్లుగా సిఐ బి.వెంకటరావు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి భీమిలి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అమర రాజయ్య అని, అతను విశాఖపట్నం గోల్డ్ గెయిన్ అనే జ్యువలరీ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నట్లు, సదరు షాపు యజమాని పవన్ కుమార్ విజయనగరంలోని బంగారు షాపులకు వస్తువులను విక్రయించి, డబ్బులు తీసుకొని రమ్మనమని చెప్పినందున, వాటిని విజయనగరం తీసుకొని వచ్చినట్లుగా విచారణలో వెల్లడించారని సిఐ బి.వెంకటరావు తెలిపారు. సీజ్ చేసిన బంగారు వస్తువుల విలువ రూ. 1 కోటి 51 లక్షల 10 వేలు గా అంచనా వేశామని తెలిపారు.

Tags:
Views: 20

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..