యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్  జయంతి

యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్  జయంతి

 

ఐ ఎన్ బి టైమ్స్,మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 14: మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్  లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.పంచశీల జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గా మొదటిసారి అంబెడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. అందరికి స్ఫూర్తి, దారి చూపిన మహనీయుడు  దేశంలో కుల వివక్ష ఉండేది దీన్ని రూపుమాపి అంబెడ్కర్ దళితులను,పేదలను ఆదుకున్నారు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి అనేక కాంస్య విగ్రహాలు ఇచ్చారు
ఇప్పటి వరకు తాను 110 అంబెడ్కర్ విగ్రహాలు ఇచ్చాను. అంబెడ్కర్ విగ్రహాలు పంపిణీ చేసే వరం ఆ దేవుడు కల్పించాడు.అంబెడ్కర్ ఆశయం కూల వ్యవస్థ దూరం చేయడమే.ఆయన స్ఫూర్తి గా అందరం కలిసికట్టుగా పనిచేయాలి దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత అంబెడ్కర్ దే. ఐక్యంగా ఉండాలి, విభేదాలు పక్కన పెడితే అన్నిటికీ నేను అండగా ఉంటా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు,మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్. యువజన సంఘం అధ్యక్షుడు రామిల్ల మల్లేష్ ఉపాధ్యక్షుడు,ఎట్టం లచ్చయ్య, ముఖ్య సలహాదారు బైరమళ్ళ మొగలి, కోశాధికారి ఆగయ్య, పూర్ణచందర్ సరేస్ దళిత సంఘాలు,కార్మిక,రాజకీయ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.

Tags:
Views: 8

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసెంబ్లీ  సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం. అసెంబ్లీ సెగ్మెంట్ల శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ..ఎన్నికల నిర్వహణలో పివో, ఏపీవో, ఓపివో పాత్ర కీలకం.
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01: ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపివో ల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్...
ప్రభుత్వభూమిలో అక్రమ నిర్మాణాలు అమ్మకాలు
బడ్జెట్ స్కూల్స్ యాజమాన్యాల సమస్యలు పరిష్కరిస్తా
రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిపించండి - ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు పాలకూరి అశోక్‌కుమార్
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. పోరాటాలకు స్పూర్తి 'మేడే'.. కార్మిక రక్త కెరటం మన ఎర్రజెండా..
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..