భారత్ లో మహిళలకు టాప్ 10 సురక్షిత నగరాలివే-తక్కువ నేరాలు, ఎక్కువ ఉద్యోగాలు !

భారత్ లో మహిళలకు టాప్ 10 సురక్షిత నగరాలివే-తక్కువ నేరాలు, ఎక్కువ ఉద్యోగాలు !

భారత్ లోని పలు మెట్రో నగరాల్లో ఇప్పుడు మహిళల భద్రతకు సంబంధించిన చర్చ పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రివేళ ఉద్యోగాలు ముగించుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లాలంటే ఏ నగరం బెస్ట్ అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో టాప్ 10 సురక్షిత నగరాల జాబితాను ప్రముఖ డైవర్సిటీ కన్సల్టెన్సీ అవతార్ గ్రూప్ విడుదల చేసింది. ఇందులో తక్కువ నేరాలు, ఎక్కువ ఉద్యోగాలతో మహిళలకు అనువైన నగరంగా చెన్నై నిలిచింది.  దేశవ్యాప్తంగా పనిచేసే మహిళలకు సురక్షితమైన నగరాల్లో టాప్ 10 ఎంపిక చేయగా.. ఇందులో చెన్నై అగ్రస్ధానంలో నిలిచింది.డైవర్సిటీ కన్సల్టెన్సీ సంస్థ అవతార్ గ్రూప్ ద్వారా భారతదేశంలో మహిళల కోసం అగ్ర నగరాలు (TCWI) పేరుతో ఓ నివేదిక రూపొందించింది. ఇందులో జనాభా ఆధారంగా భారతీయ నగరాలను రెండుగా విభజించింది. మహిళల ఉపాధికి అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడం కోసం ఒక్కొక్కటి మిలియన్ల మందికి పైగా నివసించే నగరాల జాబితాలో చెన్నై టాప్ లో ఉండగా.. ఆ తర్వాత బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్ ఉన్నాయి. ఈ అధ్యయనం కోసం సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్ (CIS)ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇందులో సోషల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (SIS), ఇండస్ట్రియల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (IIS), సిటిజన్ ఎక్స్‌పీరియన్స్ స్కోర్ (CES) ఉన్నాయి. ఈ సర్వే భారతదేశంలోని 113 నగరాల్లో పని చేసే మహిళల అనుకూలతల్ని అంచనా వేసింది. ఇందులో పది లక్షలకు మించిన జాబితాలో 49 నగరాలు ఉన్నాయి. అయితే మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల రెండవ జాబితాలో 64 సిటీలున్నాయి. ఇలా మిలియన్ కంటే తక్కువ జనాభా కలిగిన రెండో విభాగంలో తిరుచిరాపల్లి మొదటి స్థానంలో నిలవగా, వెల్లూరు, కొచ్చి, తిరువనంతపురం, సిమ్లా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వెల్లూరు, కొచ్చి, తిరువనంతపురం, సేలం, ఈరోడ్, తిరుపూర్, పుదుచ్చేరితో సహా మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న 10 నగరాల్లో ఎనిమిది దక్షిణాదికి చెందినవే ఉన్నాయి. సిమ్లా, గురుగ్రామ్ మాత్రమే ఉత్తరాది నుండి ఉన్నాయి.





Tags:
Views: 11

About The Author

INB Picture

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

దేశంలోని తొలి ప్రయివేటు రైలు   --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్ హైదరాబాద్ మే 08 : కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్...
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని