మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మహిళలు సమాజానికి రోల్ మోడల్స్ గా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాద్రి కొత్తగూడెం మార్చి 05: మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అభివృద్ధికి విద్యా ప్రధానమైనది అన్నారు. విద్యావంతురాలు అయిన అన్ని రంగాల్లోనూ తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకొని  ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలన్నీ మహిళా పేరు మీదే మంజూరు చేస్తుందన్నారు. పనిచేసే మహిళలు  సమాజానికి రోల్ మోడల్స్ అని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. డి ఆర్ డి ఓ  విద్యాచందన మాట్లాడుతూ మహిళల పట్ల లింగ వివక్ష నిర్ములకు కుటుంబ వ్యవస్థ నుండే ప్రారంభం కావాలని, ఎందుకు తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలని  అన్నారు. పనిచేసే మహిళలపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత మాట్లాడుతూ  మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల పట్ల స్నేహ పూర్వక వాతావరణం కలిగి ఉండేలా చూడాలన్నారు. ఎన్సిఢీ ప్రాజెక్టు ద్వారా" భేటీ బచావో... భేటీ పడావో.. " నినాదంతో బడి ఈడు బాలికలు తప్పనిసరిగా బడిలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు, ఉద్యోగాలలో కూడా మహిళలు తమదైన శైలిలో పనిచేసే మన్ననలో పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో  విద్యాశాఖ జండర్ ఈక్విటీ అధికారి  అన్నామని  సిడిపివోలు, కనకదుర్గ, జ్యోతి, లక్ష్మీ ప్రసన్న, సులోమి, రూప, మహిళా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

మూడో నెంబర్ "గుర్తుం"దా...!  - సింగిల్ హ్యాండ్ కి  ఓటు వేయండి  - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి  - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం బ్యూరో మే 07 : అమ్మా.... అక్క... బాబూ.. తాతా... చెల్లి.... తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ "గుర్తుం"దా...! అదేనండి...
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని
నేడు ఖమ్మానికి విక్టరీ వెంకటేష్ రాక...!