Hanuman: ప్రశాంత్ భయ్యా ఏంటీది.. ఇరగదీశావు పో.. పూనకంతో ఊగిపోతున్నారు..

Hanuman: ప్రశాంత్ భయ్యా ఏంటీది.. ఇరగదీశావు పో.. పూనకంతో ఊగిపోతున్నారు..

చిన్న సినిమాగా వచ్చి.. భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది హనుమాన్ మూవీ. మొదట్లో ఈ మూవీకి థియేటర్లే దొరకలేదు.. కానీ ఇప్పుడు ఈ మూవీ నడుస్తున్న ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. హనుమాన్ కలెక్షన్లలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై 15 రోజులు దాటినా.. క్రేజ్ మాత్రం దగ్గడం లేదు కలెక్షన్లూ తగ్గడం లేదు. ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం రూ.300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. హనుమాన్ మూవీ పాన్ ఇండియా వైడ్ నడుస్తోంది. ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ఓవర్ సిస్ లో కూడా భారీగా కలెక్షన్లు రాబడుతోంది. హనుమాన్ చిత్రం ఓవరి సీస్ లో 5 మిలియన్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ చిత్రం కోసం ఇప్పటికీ కూడా ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఈ ఊపులో దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి సిక్వెల్ గా జై హనుమాన్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. హనుమాన్ మూవీ థియేటర్ లో చూస్తే మజానే వేరంటున్నారు అభిమానులు. హనుమాన్ మూవీ సౌండ్ కు సినిమాను థియేటర్స్ లో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ హనుమాన్ సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ సినిమా చూస్తూనే కూర్చిలో ఊగిపోతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. మీరు ఏం సినిమా తీశారు ప్రశాంత్ వర్మ.. ఇది చూడండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ తీసిందిగా తెలుస్తోంది. ఈ మూవీతో తేజ సజ్జాకు భారీ గుర్తింపు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఈ మూవీకి టికెట్లలో ఐదు రూపాయాలను అయోధ్య రాముడి ట్రస్ట్ కు విరాళంగా ప్రకటించారు.


Tags:
Views: 4

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం