ఇన్ఫోసిస్ లో సుధామూర్తి షేర్ల విలువ ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

ఇన్ఫోసిస్ లో సుధామూర్తి షేర్ల విలువ ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరుగా ఉన్నప్పటికీ ఆమెకు కించిత్తు గర్వం లేదు. అహంకారం మచ్చుకు కూడా కనపడదు. సింపుల్ గా సాంప్రదాయబద్దమైన చీరకట్టులోనే కనిపించేందుకు ఆమె ఇష్టపడతారు. నిరాడంబరతకు నిలువెత్తు రూపం ఆమె.భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో 0.83 శాతానికి సమానమైన 3.45 కోట్ల షేర్లు ఆమె పేరుమీద ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్ షేరు రూ. 1612 కాగా వీటిప్రకారం సుధామూర్తి షేర్ల విలువ రూ. 5,600 కోట్లుగా ఉంది. దాతృత్వంలో సుధామూర్తి ముందుంటారు. మూర్తి ట్రస్టుకు ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఎన్నో పుస్తకాలు రాసిన మంచి రచయిత్రి ఆమె. నారాయణమూర్తికి 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ.2691 కోట్లు. ఇన్ఫోసిస్ సంస్థ చిన్న కంపెనీగా ప్రారంభమై ఇప్పుడు రూ. 6.69 లక్షల కోట్ల మార్కెట్ విలువను కలిగివుంది. దేశంలోని టాప్-10 కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ కూడా ఒకటి. సుధామూర్తికి 2006లో పద్మశ్రీ దక్కింది. ఈ ఏడాది జనవరిలోనే పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఈ దంపతుల కుమార్తె. నార్త్ కర్ణాటకలోని షిగ్గావ్‌లో 1950 ఆగస్టు 19న సుధామూర్తి జన్మించారు. ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి బంగారు పతకం అందుకున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎంఈ పూర్తి చేసి టెల్కో లో (టాటా మోటార్స్) తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇన్ఫోసిస్ కంపెనీ ప్రారంభించడానికి అవసరమైన 10వేల రూపాయలను నారాయణమూర్తికి ఆమే ఇచ్చారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా కూడా సుధామూర్తి కొనసాగారు.

Tags:
Views: 3

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం