మావోయిస్టులకు భారీ షాక్ -- గడ్చిరోలి ఎన్ కౌంటర్ నాలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం..!! 36 లక్షల రూపాయల రివార్డు జిల్లా ఎస్పీ నీలోత్పల్.

మావోయిస్టులకు భారీ షాక్   -- గడ్చిరోలి ఎన్ కౌంటర్  నాలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం..!!   36 లక్షల రూపాయల రివార్డు  జిల్లా ఎస్పీ నీలోత్పల్.

ఐ ఎన్ బి టైమ్స్ గడ్చిరోలి మార్చి 19: ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురు దెబ్బ తగిలింది.. మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్ర నేతలు ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. వీరిలో ఒకరిపై 36 లక్షల రూపాయల రివార్డు ఉందని సమాచారం. నేడు ఉదయం ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణ సరిహద్దుల నుంచి ప్రాణహిత నదిని దాటి కొంతమంది నక్సల్స్ ప్రవేశించినట్టు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో గడ్చిరోలి పోలీసులు మావోయిస్టుల కోసం ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగినట్టు మావోయిస్ట్ అగ్రనేతలు మరణించినట్టు పేర్కొన్నారు గడ్చిరోలి జిల్లా ఎస్పీ నీలోత్పల్.తెలంగాణా నుండి ఛత్తీస్ గడ్ లోకి నక్సలైట్లు ప్రవేశించారని, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల దాడులకు వీళ్లు వ్యూహరచన చేసినట్టు, తెలంగాణ నుండి ప్రాణహిత నదిని దాటి గడ్చిరోలిలో కి ప్రవేశించినట్టు జిల్లా ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. ఈ క్రమంలోనే Ç60 కమాండోలతో పాటు సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టిందని వివరించారు. రేషన్ పల్లి సమీపంలోని కోలమర్క పర్వతాలలో మంగళవారం ఉదయం ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా నక్సలైట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాల్పుల అనంతరం అక్కడ నలుగురు మావోలు మృతి చెందినట్టు గుర్తించారన్నారు. నేడు తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారని పేర్కొన్న ఆయన ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సంఘటనా స్థలంలో ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.ఇక మిగిలిన మావోల కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Tags:
Views: 11

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం