వైసీపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలి - కె కె రాజు

వైసీపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలి - కె కె రాజు

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం ఏప్రిల్:02ఎన్నికలవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ అభిమానులు సమన్వయంతో ముందుకు సాగాలని వైసిపి ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె కె రాజు  అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 45వ వార్డు పరిధి వాసుదేవ్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్  ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కె కె రాజు  హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంత ప్రజలు గ్రామ పెద్దలతో సమీక్ష నిర్వహించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కె కె రాజు  మాట్లాడుతూ పేదల పేదలుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనే ఆలోచన చంద్ర బాబు ది అయితే..ఓట్ల శాశ్వతం కాదు సీట్లు శాశ్వతం కాదు రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజల మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు ఈ అవకాశాన్ని మనం  సద్వినియోగం చేసుకోవాలి మన పరిపాలించే కాలంలో పేదల కష్టాలు తీర్చి పేద కుటుంబాలను ఉన్నతంలోకి తీసుకొచ్చి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకునే నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి  అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి వికెపి  సిపిఐఆర్ చైర్మన్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు ,డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ళ శివ గణేష్, పైడి రమణ, హరి పట్నాయక్, అంబటి శైలేష్,సన్నీ,ఈశ్వర్ రావు, ఏక్కబు, నానీబాబు, దుర్గ,నరసింగ్ రావు,మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం