రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియపరచిన

జిల్లా కలెక్టర్ శశాంక

రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియపరచిన

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ నవంబర్ 18 :జిల్లా సమీకృత కార్యాలయాల సమూహం( ఐ డి ఓ సి )నందు, రాష్ట్రస్థాయిలో జరిగిన కళా ఉత్సవంలో మన జిల్లా నుండి ఎ రంజిత్  జాతీయస్థాయికి ఎంపిక కావడం జరిగింది అలాగే రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి పొందిన బి కృష్ణవేణి . పి భాను ప్రకాశ్ లకు  జిల్లా కలెక్టర్  అభినందనలు తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన కళా ఉత్సవ్ 2023 పోటీలలో మన మహబూబాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన   ఈఎంఆర్ఎస్ కొత్తగూడ పాఠశాల విద్యార్థి ఎ .రంజిత్, విజువల్ అర్ట్స్ (3D) విభాగంలో మొదటి బహుమతి సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని  మరియు క్లాసికల్ పాటల విభాగంలో  ఈఎంఆర్ఎస్ కురవి విద్యార్థిని బి. కృష్ణవేణి ద్వితీయ బహుమతి సాధించగా, టి ఎస్ ఎం ఎస్ మహబూబాబాద్ విద్యార్థి పి. భాను ప్రకాష్ ఫోక్ డాన్స్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు.. రాష్ట్రస్థాయిలో  బహుమతులు సాధించి మహబూబాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలను నిలిపిన విద్యార్థులకు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ విద్యార్థులను శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య తోపాటు ఏదో ఒక కళా రంగంలో రాణించాలని ఇది ప్రతి విద్యార్థి ఆశయంగా తీసుకోవాలని కోరారు జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కళలను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రామారావు acge శ్రీరాములు. ఏ ఎం ఓ ఆజాద్ చంద్రశేఖర్ కళా ఉత్సవ కో కన్వీనర్ సామ్సన్ సుధాకర్. గైడ్ టీచర్లు. కుమారస్వామి నవ్య శ్రీ  రవి తదితరులు పాల్గొన్నారు

Tags:
Views: 14

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం