కుటుంబ నేపథ్యమే.. సివిల్స్ వైపు నడిపించింది..!!

మానుకోట కలెక్టర్ శశాంక.. మన..తెలంగాణబిడ్డ.. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు స్పూర్తిగా నిలిచే ప్రస్థానం..!!

కుటుంబ నేపథ్యమే.. సివిల్స్ వైపు నడిపించింది..!!

ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ డిసెంబర్ 11 : పేరున్న కార్పోరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఎండపొడ కూడా సోకనంత సుఖం.. ఏటేటా..పెరిగిపోయే వేతనం కానీ.. ఆ..యువకునికి ఎందుకో అందులో సంతృప్తి ఉన్నట్లుగా అనిపించలేదు.. సమాజహితం కోసం పనిచేయాలని.. ప్రజల బాగుకోసం సేవచేయాలనే ఆలోచన పదే..పదే ఆ..యువకుని మదిలో మెదులుతుండేది.. ఆయన కుటుంబనేపథ్యం కూడా అందుకు కొంత కారణం అయ్యింది.. జీవితం స్థిరపడిపోయింది.. ఇక..హాయిగా బ్రతికేయడమే అని.. అంతా అనుకుంటున్న తరుణంలో కొన్ని సంవత్సరాలపాటు శ్రమించి సాదించిన ఉన్నత ఉద్యోగాన్ని ఒక్క పూటలో వదిలేసి.. సివిల్స్ బాట పట్టారు. మళ్ళీ కఠోరశ్రమ.. నిరంతర పరిశ్రమ పోరాడారు.. జయించారు.. ఏకంగా సివిల్స్ లో 16వర్యాంక్ సాదించాడు తనేంటో నిరూపించాడు.. అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడు.. పేరుకు తగ్గట్టే పండువెన్నెలలు కురిపించే చంద్రుడిలా..! అనుకుంటే కానిది.. ఏమున్నది అనే పాటలా ముందుకు సాగిపోతున్నాడు.ఆయనే మహబూబాబాద్ కలెక్టర్ కే.శశాంక ఐఏఎస్..  నూటికి నూరుపాళ్లు మన తెలంగాణబిడ్డ..!!  పుట్టింది పెరిగింది నల్గొండజిల్లా మోత్కూరు, గుండాల ప్రాంతం.. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అమ్మ తెలుగు ఉపాద్యాయురాలు ఆమె ప్రభావంతోనే.. శశాంక తెలుగుబాష పైన సాహిత్యంపైన చిన్ననాటి నుండి మంచి అభిరుచి పెంచుకున్నారు. నాన్న ఇండియన్ డ్రగ్స్ అండ్ పార్మ ఇనిస్టిట్యూట్ లో ఉద్యోగి..  ఆ.. ఆదర్శదంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడికి ఆదిత్య, చిన్నకుమారునికి శశాంక అని పేర్లు పెట్టుకున్నారు. పేర్ల ఎంపికలోనే ఆ..తల్లిదండ్రుల గొప్పదనం మనకు తెలుస్తుంది.. ఆదిత్య అంటే సూర్యుడు..! శశాంక అంటే చంద్రుడు..!! అంతటి గొప్ప తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన ఇద్దరు పిల్లలు మరింత గొప్ప  ప్రయోజకులే అయ్యారు.  చదువంతా హైదరాబాద్ లోనే..! మానుకోట కలెక్టర్ శశాంక హైదరాబాద్ లోని స్వామివివేకానంద సెంటినరీహైస్కూల్ లో పదవతరగతి పూర్తి చేసారు. లిటిల్ ప్లవర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ యంఇసితో పూర్తిచేసారు. ఆ..సమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులంతా యంపిసి, బైపిసి ల వైపు పరుగులు పెడుతుంటే శశాంక మాత్రం అందుకు బిన్నంగా యంఇసి ని ఎంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ కామర్స్ లో బికాం హానర్స్ పూర్తి చేసారు. 2008లో చార్టెడ్ అకౌంట్ కోర్సు కూడా పూర్తి చేసి కాన్ స్టాంగ్ యంగ్ ప్రయివేట్ లిమిటెడ్ లో అడ్వయిజరీ సర్వీస్ లో ఉన్నత ఉద్యోగంలో చేరారు. మూడు సంవత్సరాలపాటు హైదరాబాద్ లోనే ఉద్యోగం కూడా చేసారు.  అయినా.. ఆయనకు తృప్తిలేదు..!! అంతా.. ఆహా..ఓహో అన్నారు.. శశాంక సాదించాడంటూ ప్రశంసించారు. అయినా ఎందుకో ఆయనకు మాత్రం తృప్తిలేదు.. జీవితం అంటే ఇది మాత్రమే కాదు..మరేదో ఉంది అని ఆలోచించేవారు. అప్పటికే ఆయన సోదరుడు ఆదిత్య యంయస్ చేసి సాప్ట్ వేర్ గా స్థిరపడ్డారు. తాను మరో కార్పోరేట్ కంపెనీలో చాలా..చాలా..మంచి ఉద్యోగంలో కానీ..  జనంలోకి వెల్లాలనే తన ఆలోచన.. సమాజహితం కోసం పనిచేయాలనే తన అంతరాత్మ ప్రభోదం పదే..పదే శశాంకను ఉక్కిరిబిక్కిరి చేసేవి. తెలుగు ఉపాద్యాయురాలిగా అమ్మ చెప్పిన పాఠాలు.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న నాన్న ప్రభావం.. గుండాల యంపిడిఓగా పనిచేసిన పెదనాన్న, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన పెదమామయ్య లతో అనేక సందర్భాల్లో సాగిన సంభాషణలు.. విస్తృత చర్చలు శశాంకను సివిల్స్ వైపు ఆకర్షితున్ని చేసాయి. ఏళ్ళకు ఏళ్ళు కష్టపడితే.. ఏ..కొందరికో మాత్రమే దక్కే ఉన్నత ఉద్యోగాన్ని ఒక్క లేఖతో వదిలేసి శశాంక డిల్లీ వెళ్ళారు. అక్కడే శిక్షణ తీసుకొని 2011లో మొదటిసారి సివిల్స్ పరీక్షలకు హాజరయ్యి మెయిన్స్ వరకు వచ్చారు. అయినా లక్ష్యం వీడకుండా మరింత బలంగా ముందుకుసాగారు. 2012లో జాతీయస్థాయిలో 16వర్యాంక్ తో శశాంక ఐఏఎస్ గా ఎంపికయ్యారు. అప్పడు ఆంద్రప్రదేశ్ గా ఉన్న స్వంతరాష్ట్రానికే ఆయన కేటాయించబడ్డారు. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాలలో పలు జిల్లాలలో పనిచేసారు.  లక్ష్యం ఉన్నతంగా ఉండి.. విజయం సాదించాలనే పట్టుదల మరింత బలంగా ఉన్నప్పుడు ప్రతివ్యక్తి జీవితంలోనూ పండువెన్నెలలు ఉంటాయని నిరూపించిన శశాంక లాంటి ఒక గొప్ప అధికారి మన..మానుకోట జిల్లాపాలనాధికారిగా ఉండడం..  ప్రస్తుతం పోటీపరీక్షలకు సిద్దమవుతున్న యువతకు స్పూర్తిదాయకం..

Tags:
Views: 16

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం