గుంటూరు కారం సినిమాలో విలన్స్ కు మార్క్స్, లెనిన్ పేర్లు, మడత కుర్చీబూతు పాట తొలగించాలి. పి డి ఎస్ యు

గుంటూరు కారం సినిమాలో  విలన్స్ కు మార్క్స్, లెనిన్ పేర్లు, మడత కుర్చీబూతు పాట తొలగించాలి. పి డి ఎస్ యు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం జనవరి 16:   పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమాలో విలన్స్ కు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడానికి అదేవిధంగా మడత కుర్చీ బూతు పాటని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము. సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ కు మతి భ్రమించింది. శ్రామికవర్గ నేతలు, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల పేర్లు పెట్టి సమాజానికి తప్పుడు అవగాహన కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కారల్ మార్క్స్ ప్రపంచానికి  కమ్యూనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి. శ్రామిక వర్గ సిద్ధాంతం "దాస్ కాపిటల్" రచించి ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గాన్ని విముక్తి చేయడానికి తన జీవితాన్ని ధారపోశాడు. అలాగే కామ్రేడ్ లెనిన్ మార్క్సిజం తో  రష్యా దేశంలో  విప్లవాన్ని విజయవంతం చేశాడు. దోపిడీ, పీడన, అణచివేత లేని సోషలిస్టు సమాజాన్ని ఏర్పరిచాడు. అలాంటి మహానేతల పేర్లని గుంటూరు కారం సినిమాలో  విలన్స్ కి పెట్టడం తీవ్రమైన అభ్యంతరకరం. అలాగే సినిమాలో మడతకుర్చీ బూతు పాటను పెట్టడానికి కూడా పి డి ఎస్ యు, ఖమ్మం జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.  డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు జరిగిన ఈ ఘోరమైన తప్పిదానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి వీటిని తొలగించాలని. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు కారం సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళనలు చేపడతామని డైరెక్టర్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము..

Tags:
Views: 21

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం