నా వ్యాపార భాగస్వామి నన్ను చంపేస్తామంటున్నాడు .
ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు సెప్టెంబర్ 9: తన వ్యాపార భాగస్వామి అయిన షేక్ మహమ్మద్ హమీద్ తనను చంపుతామని బెదిరించడమే కాకుండా, తన కల్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నారని, తనను భయాందోళనకు గురిచేస్తున్నారని , బాధితుడైన షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ తెలిపారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు . తనతో మంచిగా మెలిగి వ్యాపారంలో వాటా కావాలని చెప్పడంతో తన బందువైన షేక్ మహమ్మద్ హమీద్ తాను కలిసి నెల్లూరుజిల్లా ఉదయగిరిలో కల్యాణ మండపం నిర్మించామన్నారు. 2020 లో నెల్లూరుజిల్లా ఉదయగిరిలో " ఆల్ ఖైర్ " అనే పేరుతో తానూ తన భాగస్వామీ కల్యాణ మండపం నిర్మించామన్నారు. ఈ మండపాన్ని 2023 మార్చ్ 5 న ప్రారభించామని వివరించారు. ఈ క్రమంలో ఒక నెల రోజుల వ్యవధిలోనే తన భాగస్వామి అయిన మహమ్మద్ హమీద్ తన వాటా తనకు ఇవ్వాలని కోరగా 60 లక్షల రూపాయలు ఆయన వాటా , పెద్ద మనుషుల సమక్షంలో ఇచ్చి ఒప్పంద పత్రం రాయించుకోవడం జరిగిందన్నారు . అయితే ఇటీవల మహమ్మద్ హమీద్ ఆయన మనుషులు ఉదయగిరిలో తాను కల్యాణ మండపంలో వుండగా నన్ను బెదిరించి, చంపుతామనడంతో బంధువుల వూరు అయిన ప్రకాశం జిల్లాకు వెళ్లి తలదాచుకుంటున్నానని వాపోయారు. నెల్లూరుకు చెందిన సాబీర్ ఖాన్ మరియు షాహిధ్ అనే సివిల్ సప్లైస్ ఉద్యోగి వల్ల తనకు ప్రాణహాని వుందని , జిల్లా ఎస్పీ తనకు ప్రాణరక్షణ కల్పించి తన ఫంక్షన్ హాల్ తనకుఇప్పించాలని విజ్ణప్తి చేసారు .
Comment List