ఇలా చేస్తే నేనే హోం మంత్రిని అవుతా.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఇలా చేస్తే నేనే హోం మంత్రిని అవుతా.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు


ఐ ఎన్ బి టైమ్స్   నవంబర్ 04 పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అభిప్రాయ పడ్డారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరుగుతున్న ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని కోరారు. సంబంధిత మంత్రులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.గొల్లప్రోలులో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అక్కడ ఫార్మా పరిశ్రమతో వ్యర్థాలు, పిల్లలపై లైంగికదాడుల గురించి ప్రస్తావించారు. ఫార్మా పరిశ్రమ వ్యర్థాలతో మత్స్య సంపదకు జరుగుతున్న నష్టంపై పరిశీలిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. పిల్లలపై లైంగికదాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను ప్రత్యేక దృష్టిసారించాం. అయినప్పటికీ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదు. నిజాయితీగా పనిచేయాలని చెబితే మీనమేషాలు లెక్కిస్తున్నారు. మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకుని వచ్చేలా వ్యవహరిస్తున్నారు. నేను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకు అని’ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.‘ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది. డీజీపీ ఇంటిలెజెన్స్ అధికారులు బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. క్రిమినల్స్‌ను అరెస్టు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. నాకు డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వసతి గృహాల్లో ఉండే అమ్మాయిలను కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. ఇసుకలో ఎంత వస్తుందని కొందరు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు తప్ప ఇలాంటి వాటిపై దృష్టిసారించడం లేదు అని’ పవన్ కల్యాణ్ మండిపడ్డారు.‘ఇసుక బ్లాక్ మార్కెట్ జరుగుతుంటే ఎదురు తిరగాలని ప్రజలకు పిలుపునిచ్చా. అందరికీ తినడం అలవాటైపోయింది. దాన్ని మార్చడానికి సీఎం చంద్రబాబు, నేను ప్రయత్నిస్తున్నాం. మీ సొంత అవసరాలకు ఇసుక కావాలంటే బండి లేదా ట్రాక్టర్ తీసుకువచ్చి ఉచితంగా తీసుకువెళ్లండి. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తాం. అందుకోసం 39.76 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు ఉన్నాయి అని’ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

 

 

 

 

 
Tags:
Views: 3

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే