త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్

త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్

ఐ ఎన్ బి టైమ్స్ ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 7: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మార్పు అంశానికి సంబంధించి మాజీ మంత్రి జోగిరమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు రావాల్సిన బిల్లులు రాగానే పార్టీ మారిపోయారంటూ మాజీ మంత్రి ఆరోపణలు గుప్పించారు. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జోగి రమేష్ ఒక గొంగళి పురుగు లాంటివాడన్నారు. ‘‘నేను రాజకీయంగా ఆదరించిన మైలవరం నియోజకవర్గంకు మంత్రిగా నువ్వు ఏం ఒరగాపెట్టావో ప్రజలకు చెప్పు’’ అంటూ ప్రశ్నించారు.వీటీపీఎస్ బూడిదను కౌంటర్‌లు పెట్టి అమ్మిన దౌర్బాగ్యులు వీళ్ళంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు వద్ద లంచాలు, బిల్లులు ఇప్పించడానికి జోగి రమేష్, 20, 30 శాతం కమిషన్ తీసుకున్నారని.. తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. ‘‘2019 ఎన్నికల ముందు నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నావు, ఉమ్మడి కృష్ణ జిల్లాలో అత్యంత ధనవంతుడిగా ఎలా మారవో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.హైదరాబాద్‌లో ఆస్తులను ఏ డబ్బులతో కొన్నావని ప్రశ్నించారు. సొంత బాబాయికి అప్పు ఉండి దొంగ భూములు కట్టబెట్టిన చరిత్ర జోగిదని దుయ్యబట్టారు. అందరికి ఇచ్చినట్టే తనకు పరిశ్రమలు పెట్టినందుకు రాయితీ నగదు ఇచ్చారన్నారు. జగన్ తనకేం ఉదరాతతో నిధులు విడుదల చేయలేదని వెల్లడించారు. ‘‘ నీ ఎదుగుదలకు నారు, నీరు పోసిన మీ బాబాయి వద్ద ఇండస్ట్రీ శాఖ వద్ద నిధులు ఇప్పించి లంచం తీసుకున్నావా లేదా. వెంకటేశ్వరస్వామిని నమ్ముతావో, ఏసు ప్రభువును నమ్ముతావో తెలియదు వందశాతం నువ్వు లంచం తీసుకున్నావు.జోగి రమేష్ మరలా అసెంబ్లీలో అడుగు పెట్టలేడు. అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు జోగి. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడితే ఎక్కడికి పోయావు. మరో పది రోజుల్లో మీ పార్టీ నాయకులే నీకు సినిమా చూపిస్తారు. మమ్మల్ని రౌడీయిజం చేసి భయపెడతానంటే చూస్తూ ఊరుకోం, ప్రజాస్వామ్యబద్ధంగా నీకు బుద్ధి చూపెడతాం. పెడనలో నువ్వు ఏ రకంగా మట్టి, ఇసుక, భూమి దందాలు చేసావో అక్కడ వైసీపీ శ్రేణులు చెబుతారు. నీ చరిత్ర అంతా రోజుకు ఒకటి చొప్పున సోషల్ మీడియాలో చూపెడతాం’’ అంటూ జోగి రమేష్‌కు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు.

 

 

 

Tags:
Views: 0

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే