గతానికి నేటికీ మధ్య వారదులే వృద్ధులు

వృద్ధులకు సమాజంలో గుర్తింపు, గౌరవం కల్పించాలి - యువతరం ఈ బాధ్యతను స్వీకరించాలి

గతానికి నేటికీ మధ్య వారదులే వృద్ధులు

 ఆత్మగౌరవంతో కూడిన వృద్ధాప్యం అవసరం

 ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం నవంబర్ 6 (బీచ్ రోడ్డు) :సమాజంలో వృద్ధుల ఆవశ్యకతను ప్రాధాన్యతను గుర్తించడం ఎంతో అవసరమని హెరిటేజ్ ఫౌండేషన్ ఇండియా చైర్మన్ డాక్టర్ కె.ఆర్ గంగాధరన్ అన్నారు. హెరిటేజ్ ఫౌండేషన్ ఆర్.ఆర్.టి.సి, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ, ఏయూ జాతీయ సేవా పథకం సంయుక్తంగా  బుధవారం ఉదయం బీచ్ రోడ్ లో కాళీమాత ఆలయం నుంచి వైఎంసిఏ వరకు అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధరన్ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులకు తగిన గౌరవాన్ని కల్పించడం వారికి భద్రతను ఇవ్వడం ఎంతో అవసరమని చెప్పారు. నేడు సమాజంలో వృద్ధులకు, యువతకు మధ్య కొంత దూరం ఏర్పడుతోందని ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా వృద్ధులు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు పరిష్కారాల చూపడం, వాటికి సమాధానం ఇవ్వడం మనందరి బాధ్యతగా నిలుస్తుంది అన్నారు. సమాజంలోని అన్ని తరగతుల, అన్ని వర్గాల్లో వృద్ధులకు సరైన పోషణ, వసతి, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని చట్టాలు సైతం స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను తెలియజేస్తూ వారి ఆవశ్యకతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ అవగాహన నడకను విశాఖలో నిర్వహిస్తున్నామని అన్నారు. గతానికి ప్రస్తుతానికి మధ్య వారధులుగా వృద్ధులు నిలుస్తారని వారి అనుభవాన్ని, జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత అవసరమని చెప్పారు.ఏయు జాతీయ సేవా పథకం సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్ మాట్లాడుతూ గతంలో భారత దేశంలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య అధికంగా ఉండేదని, అప్పుడు వృద్ధులకు తగిన భద్రత, గౌరవం, హోదా సైతం లభించేవని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యాంత్రిక జీవనంలో వృద్ధులకు సమాజంలో తగిన గుర్తింపు గౌరవం లభించడం లేదు అనేది వాస్తవం అన్నారు. ప్రధానంగా యువతకు వృద్ధుల పట్ల అవగాహన కల్పిస్తూ సన్నిహిత అనుబంధాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఆత్మగౌరవంతో కూడిన వృద్ధాప్యం ఎంతో అవసరమని, సంతోషకర జీవనం, ఆరోగ్యకర వృద్ధాప్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతుండడం పెద్ద సవాలుగా మారుతోందని చెప్పారు. జీవన ప్రమాణాలు పెరగడం కూడా దీనికి కారణం అన్నారు. అదే సమయంలో యువత జనాభా తగ్గిపోవడం జరుగుతోందని చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడం ఎంతో అవసరమని దీని ప్రాధాన్యతను ప్రజల గుర్తించాలని కోరారు.కార్యక్రమంలో హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులు జాతీయ సేవా పథకం వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Views: 10

Advertisement

Latest News

ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 12:సోమవారం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్  2024-2025 ఆర్థిక సంవత్సరానికి మైనార్టీల...
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ ఆత్మీయ సమ్మేళనన్ని జేయప్రదం చేయండి..గడ్డిపర్తి శ్రీనివాసరావు
26వ తేదీ నుంచి మెగా సప్లిమెంటరీ పరీక్షలు
వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ రియాక్షన్ ఇదే