ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేరెడ్డి మంజులా కోటిరెడ్డి.
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల నవంబర్ 09:ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలరోజుజరిగినహింసదేశవ్యాప్తంగాచర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో పల్నాడులోని రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో జరిగిన హింస దృశ్యాలు వైరల్ అయ్యాయి.అలాంటి హింసలో ఓ మహిళ చేసిన సాహసం,
తెగువ అందరి దృష్టిని ఆకర్షించించి.మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఓ పోలింగ్ బూత్‌లో చేరెడ్డి మంజుల భర్త కోటిరెడ్డి టీడీపీ తరపున 241 బూత్ నెంబర్ గా ఉన్నారు.అయితే ఆ గ్రామంలో పోలింగ్ బూత్‌లలో టీడీపీ ఏజెంట్లు లేకుండా ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకోవాలనుకున్న వైసీపీ నేతలు 241వ బూత్ కు వెళ్తున్న చేరెడ్డి మంజులారెడ్డి పై అతి కిరాతకంగా దాడిచేశారు.గొడ్డలితో ఆమె తలపై వేటు వేశారు. భయానకంగా గాయమైనా ఆమె వెనక్కి తగ్గలేదు.అలాగే పోలింగ్ బూత్‌కువెళ్లారు అనంతరం అప్పటి ఇంచార్జి ఎమ్మెల్యే,ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానంద రెడ్డి చొరవతో జిల్లా ఎస్.పి స్పెషల్ పార్టీ పోలీసు బలగాలను రంగంలోకి దింపడంతో అప్పుడు మంజులా రెడ్డి వైద్యశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నారు.అనంతరం కొన్ని సమస్యల తర్వాత ఎట్టకేలకు ఓటింగ్ ముగిసింది.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరెడ్డి మంజుల రెడ్డిని గుర్తించి నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చొరవతో నామినేటెడ్ పోస్టుల్లో ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆమెకు శనివారంనాడు ఇచ్చారు.పదవి ఇవ్వడంపై రెంటచింతల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి,టౌన్ అధ్యక్షులు మూలి రాజారెడ్డి,మాజీ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి,మాజీ పీహెచ్సీ చైర్మన్ బోడపాటి రామకృష్ణ,సర్వయ్య(రెంటాల),లు మంజులా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జనసేన,బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మంజులా రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకముంచి చైర్మన్ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,నారా భువనేశ్వరి కి,ఎమ్.పి లావు శ్రీకృష్ణదేవరాయలకు,మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి తెలుగుదేశం పార్టీనాయకులకు ఋణపడి ఉంటానని ఆమె తెలిపారు.
Comment List