సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున

సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున

ఐ.ఎన్.బి టైమ్స్ న్యూస్ రెంటచింతల నవంబర్ 11:రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఐదుగురు యువకులు అను అసత్య కథనం గురించి రెంటచింతల ఎస్.ఐ సి.హెచ్ నాగార్జున వివరాలు ఇలావున్నాయి.ఈ నెల 05వ తేదీన నాగులచవితి సందర్భంగా మంచికల్లు గ్రామంలో నాగమయ్యస్వామి పుట్ట దగ్గర కోలాటం కార్యక్రమంను గ్రామస్తులు ఏర్పాటు చేసినారు.ఈ కోలాటం కార్యక్రమం చూడటానికి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా రెండవ కూతురు,మరొక అమ్మాయి రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో కోలాటం వద్దకు వెళ్ళగా అక్కడున్న 16 ఏళ్ల అబ్బాయి అబ్దుల్లా కూతురితో స్నేహం తగ్గించుకో అని అక్కడే ఉన్న మరొక అమ్మాయి తో చెప్పినాడు.ఆ విషయమై అబ్దుల్లా కూతురు,ఆ కుర్రవాడి పై కోప్పడి,అతనిని తిట్టినది.ఈ విధంగా అబ్దుల్లా కూతురు కుర్రవాడిని తిట్టడం వలన,ఆ కుర్రవాడు మీ నాన్న ఫోన్ నంబర్ ఇవ్వు నువ్వు నన్ను తిడుతున్నావని మీ నాన్నకు చెప్తాను అని అబ్దుల్లా కూతురి తో అన్నాడు.అబ్దుల్లా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పినది. అంతటితో ఆమె తండ్రి షేక్అబ్దుల్లాకోపోద్రిక్తుడై,కుర్రవాడితో గొడవకి వెళ్లగా, అక్కడున్న చుట్టుప్రక్కలవారు జరిగిన విషయం అబ్దుల్లాకి చెప్పి, అతనిని అక్కడినుండి పంపినారు. ఆ తరువాత మరలా 08 వ తేదీన రాత్రి అబ్దుల్లా, ఆ కుర్రవాడు పని చేసే మంచికల్లు SC కాలనీ దగ్గరలో గల టెంట్ హౌస్ దగ్గరకి ఆ కుర్రవాడితో గొడవ పడటానికి వెళ్ళినాడు.అంతట అక్కడున్న టెంట్ హౌస్ యజమాని అయిన షేక్ సైసావలి అతని కుటుంబసభ్యులు షేక్ నాగులు,చిన్నబాష చిన్నపిల్లల గొడవని ఎందుకు పెద్దది చేస్తున్నావని చెప్పి,మాట వినకుండా గొడవ చేస్తున్న అబ్దుల్లాని చేతితో అతని భుజం మీద ఒక దెబ్బ కొట్టి అక్కడినుండి పంపించివేశారు.అబ్దుల్లా ఇచ్చిన ఫిర్యాదుపై వారు 10వ తేదీన కేసు Cr.No 117/2024 U/s 118(1), 351(2), 79 r/w 3(5) నమోదు  చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్.ఐ నాగార్జున తెలిపారు.ఇలాంటి అవాస్తపు,ఊహాజనితమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేరమని అట్టివారిపై ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ హెచ్చరించారు.

Tags:
Views: 34

Advertisement

Latest News

దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దుర్గి మండలం లో నేటినుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి  ప్రతినిధి నవంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్లనియోజకవర్గం,దుర్గి మండలం, దుర్గి గ్రామం  నందుగల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ది...
నిరుద్యోగి అఖిల్ మనస్థాపంతో రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య.
ప్రభుత్వం మారి నెలలు గడిచినా కొత్తరేషన్ కార్డులు ఇచ్చేదెన్నడో..?గతప్రభుత్వం నిబంధనల పేరుతో కొత్త రేషన్ కార్డు జారీ విఫలం
ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..
ముస్లింల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
మత్తు వదలని గ్రామాలు 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ సి.హెచ్ నాగర్జున