మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్, నవంబర్ 07: పీజీ మెడికల్ కాలేజీ సీట్లు అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి ఈడీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ రోజు జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. దీంతో ఈడీ ఎదుట విచారణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా ఈడీకి ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు విక్రయించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. అందులోభాగంగా గతేడాది జూన్‌లో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి నివాసం, మెడికల్ కాలేజీతోపాటు కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది.అలాగే 12 మెడికల్ కాలేజీల్లో సైతం సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు.. ఈడీ తన సోదాల్లో గుర్తించింది. దాంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితోపాటు వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
Comment List