భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 20 :మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం సత్రశాలలోని దేవాలయ ప్రాంగణంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యూలైన్లను పరిశీలించారు. కృష్ణానది స్నానాల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తిరుణాల సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు పటిష్ట పరచాలన్నారు. భక్తులకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివార్లను దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చంటి పిల్లలతో వచ్చే వారికి ఈ లైన్ లో ఉన్నవారికి మంచినీరు మజ్జిగ అందించాలని సూచించారు. వివాదాలకు తావివ్వకుండా ప్రశాంతంగా తిరుణాల మహోత్సవం, లింగోద్భవ కార్యక్రమం కళ్యాణ మహోత్సవం జరిగేలా ప్రతి ఒక్కరు పరస్పరం సహకరించుకొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
Comment List