కూటమి హయాంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి ఫిబ్రవరి 21:ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం మాచర్ల మండల పరిధిలోని విజయపురి సౌత్ రెంటచింతల మండల కేంద్రంలో శాసనమండలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పట్టభద్రులను ఎమ్మెల్యే జూలకంటి స్వయంగా కలసి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పాటుపడుతూ పారిశ్రామికవేత్తల ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తూ ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను వైన్ షాపులు ముందు విధులు నిర్వర్తించేలా చేసి ఉపాధ్యాయ ఉద్యోగ విధులను చులకన చేశారని అన్నారు. ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులను భాగస్వాములు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు కలసికట్టుగా పనిచేయటం జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే జూలకంటి కోరారు.
Comment List