మతిభ్రమించి మాట్లాడుతున్న జగన్ : జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఫిబ్రవరి 20 : జగన్మోహన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నట్లు ఉందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. గురువారం రెంటచింతల మండల పరిధిలోని సత్రశాలలో మండల పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జగన్ రెండుసార్లు యాత్రలు చేశారని మొదటి యాత్ర జైలులో ఉన్న పిన్నెల్లిని పరామర్శించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడని అన్నారు. అతడు ఏ కేసులో జైలుకు వెళ్ళాడో తెలుసా జగన్ అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలను ధ్వంసం చేసిన వ్యక్తిని పరామర్శించాడని అన్నారు. వినుకొండలో రౌడీ షీటర్ చనిపోతే అక్కడికి వెళ్లి శవరాజకీయాలు చేయడంతో పాటు శాంతి భద్రతల గురించి వల్లే వేస్తాడని అన్నారు. తన హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి విద్యుత్ చార్జీల పేరుపై ఆందోళనలకు పిలుపునిస్తాడని జగన్ హయాంలో మిర్చి గిట్టుబాటు ధర 7000గా నిర్ధారిస్తూ జీవోలు ఇచ్చి ఇప్పుడు డబ్బా బ్యాచ్ తీసుకువెళ్లి మద్దతు ధర అంటూ ముసలి కన్నీరు కారుస్తూ ఉండటంతో అతని మానసిక స్థితిపై జాలి వేస్తుందని అన్నారు. దళితులను కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తిని పరామర్శించి అందాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. తను చేసింది తప్పులెక్కడ బయటపడతాయని అసెంబ్లీకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే జగన్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి సమస్యలు మీద చర్చించాలని సవాల్ విసిరారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు గూండా గిరి దౌర్జన్యాలు చేయాలని చూస్తే ప్రజలు గుడ్డలు విడదీసి కొడతారని అన్నారు. వైసీపీకి గడచిన ఎన్నికల్లోనే ప్రజలు గుడ్డలూడదీశారని అయినా వారికి బుద్ధి రాలేదని గుడ్డలూడదీస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వైసిపి 1.0 లోనే గోరంట్ల మాధవ్ గుడ్డలూడదీసి చూపించగా సంబరాలు రాంబాబు గంట అరగంటలను చూసి ప్రజలు అసహ్యించుకున్నారని 2.0 ఓపిక ప్రజలకు లేదన్నారు.
Comment List