ఇది ప్రజలకు ఉపయోగపడే రైల్వే స్టేష నా
సింగరేణి బొగ్గు కర్మాగార్మా అని ప్రశ్నించిన కౌన్సిలర్
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి ఫిబ్రవరి 25:పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో నడికుడి రైల్వే స్టేషన్ నడికుడి రైల్వే జంక్షననా లేదా సింగరేణి బొగ్గు కర్మాగారామ. రైల్వే జంక్షన్ అంతా బొగ్గు దూళితో నిండిపోయి ఉన్నది.నిత్యం24 గంటలు వేల మంది ప్రయాణం చేసే నడికుడి రైల్వే జంక్షన్ లో గత కొన్నిరోజులు నుండి బొగ్గు అన్లోడింగ్ చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు.ప్రయాణికులు రైల్వే స్టేషన్ లో ఉండాల్సింది పోయి బొగ్గు దూళికి భయపడి రైల్వే స్టేషన్ బయట ట్రైన్ వచ్చేదాకా ఉంటున్నారు. ఈ బొగ్గు ధూళి వల్ల ఊపిరితిత్తుల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి ధూళి వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ రైల్వే జంక్షన్ పక్కనే అనేక నివాస గృహాలు, రైల్వే ఎంప్లాయ్ కోటర్స్, రైల్వే హాస్పిటల్, అదేవిధంగా దుర్గా పబ్లిక్ స్కూల్, ఎన్టీఆర్ కాలనీ ఉండి ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ బొగ్గు అర్ లోడింగ్ అనేది ప్రయాణికులు లేని పొందుగల, తుమ్మలచెరువు, గురజాల స్టేషన్లో చేయాల్సింది పోయి, నిత్యం రైలు ప్రయాణం చేసే నడికుడి జంక్షన్లో చేయటం చాలా దారుణంగా ఉందని కౌన్సిలర్ ప్రశ్నించారు సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఇటువంటి బొగ్గు అన్లోడింగ్ కార్యక్రమాలు నడికుడి జంక్షన్లో చేయకుండా చర్యలు తీసుకోవాలి. వ్యాపారం కాదు, ప్రయాణికుల భద్రత ముఖ్యం.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ ప్రయాణికులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని సౌత్ సెంట్రల్ రైల్వే మాట్లాడి సమస్య పరిష్కరించగలరు కౌన్సిలర్ షరీఫ్ కోరడం జరిగింది
Comment List