బెల్లంకొండ మండలంలో ప్రకృతి వ్యవసాయ సాగు విధానం బేష్ అంటున్న రైతులు!
ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి. బెల్లంకొండ మండలంలో ప్రకృతి వ్యవసాయ సాగు విధానం బేష్ అంటున్న రైతులు!కేంద్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి (APCNF) జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానాన్ని బెల్లంకొండ మండలం అయిన మోడల్ మండలంలో పండే 12 పంచాయతీల్లో 17 గ్రామ సమైక్య సంఘం పరిధిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే. అమల కుమారి నేతృత్వంలో మండలంలోని 13 మంది గ్రామ ఐ సి ఆర్ పి లు, 3 గురు యూనిట్ ఇన్చార్జీలు, ఎంటి లు ఇద్దరు, మోడల్ మండల టీమ్ లీడర్ ఒకరు సిబ్బంది అందరూ కలిసి ప్రకృతి వ్యవసాయాన్ని బలవపత్రం చేసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు మండలంలో పనిచేస్తున్న సిబ్బంది ప్రకృతి వ్యవసాయ మోడల్ విధానంలో (ఏటీఎం) ఎనీ టైం మనీ, 20 నుండి 25 సెంట్లు భూమిలో ఆకుకూరలు, దుంప జాతి, పండ్ల, కూరగాయలు, తీగజాతి, పంటలను పండిస్తూ ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కషాయాలు ద్రావణాలు పిచికారి చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను మానవ జీవకోటికి అందించే లక్ష్యంగా సిబ్బంది పనిచేసే విధంగా జిల్లా సిబ్బంది శిక్షణా తరగతులు ఇస్తున్నారు. గ్రామస్థాయిలో పనిచేస్తున్న క్యాడర్ ముందుగా తమకున్న భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తూ అదే విధంగా గ్రామాల్లో ఉన్న రైతులను కూడా అదే పద్ధతులకు మార్చే దిశగా సిబ్బంది కృషి చేయాలని జిల్లా అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా సిబ్బంది సాగు చేస్తున్న పంటలను కూడా జిల్లా సిబ్బంది ప్రతినెల పర్యవేక్షణ చేయడం ప్రతి సంవత్సరం వారు చేస్తున్న భూమిలో మట్టి నమూనా సేకరణ విధానాన్ని కూడా అమలుపరచడం జరుగుతుంది. మండలంలో ఆయా గ్రామాల్లో ఇప్పటివరకు 1156 మంది రైతులు 1516 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, ప్రతి, కంది, మిరప, కూరగాయలు పంటలను సాగు సాగు చేస్తున్నారు. పండిస్తున్నటువంటి పంటలను మార్కెట్లో అమ్మేందుకు ప్రభుత్వం రైతులకు (పి జి ఎస్) సర్టిఫికేషన్ అందజేసి, రైతులను గ్రూపుగా ఏర్పాటు చేసి వారి పండించిన పంటను వారే నేరుగా అమ్మేందుకు విక్రయించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. బెల్లంకొండ లో 12 ఏటీఎం, 21 కాంపాక్ట్ బ్లాకులో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే. అమల కుమారి2016 వ సంవత్సరం నుండి బెల్లంకొండ మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పలు పంటలను రైతులు సాగు చేస్తున్నారని, ప్రకృతి వ్యవసాయ విధానంలో పనిచేస్తున్న సిబ్బంది 20 నుండి 20 సెంట్లు భూమిలో 12 ఏటీఎం మోడల్ లో 15 రకాల కూరగాయల ఉత్పత్తులను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. అదేవిధంగా 2024వ సంవత్సరం నుండి ప్రతి సోమవారం బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి ఉత్పత్తులను విక్రయ కేంద్రం ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పాపాయపాలెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తు స్టాల్ ను సందర్శించి, తాజా ఉత్పత్తులను రైతులందరికీ అందించే విధంగా అందరూ కృషి చేయాలని సిబ్బందికి తెలియపరిచారు. మండలంలోని గ్రామాల్లో 21 కాంపాక్ట్ బ్లాక్ లో రైతులు పలు పంటలను ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారని తెలియపరిచారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కేంద్రం బేష్ అంటున్న స్థానిక ప్రజలు! ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలు ఆహార ఉత్పత్తులు విక్రయ కేంద్రంగా ఏర్పాటుచేసి ప్రజలకు అందించడం ద్వారా అందరికీ ఆరోగ్యంగా ఉంటుందని మండల ప్రజలు అన్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం ఉత్పత్తుల కేంద్రానికి మండల స్థాయి అధికారులు, నాయకులు ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పండించినటువంటి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలు, ఆహార ఉత్పత్తులు, కొనుగోలు చేసేందుకు వారి పొలాల వద్దకే వెళుతున్నారని సిబ్బంది తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం విధానంలో పండించినటువంటి గర్భిణీ మహిళలు, విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారని, పత్రిక ముఖంగా తెలియజేశారు.
Comment List