పుల్లరి యోధుడు కన్నెగంటికీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘన నివాళి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఫిబ్రవరి 22:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం నందుపుల్లరి యోధుడు కన్నెగంటి హనుమంతు 103వ వర్ధంతి సందర్భంగా దుర్గి మండల కేంద్రంలోని కన్నెగంటి హనుమంతు విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ పాలకులు విధించిన పుల్లరి పన్నును వ్యతిరేకించి వారి తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు అని కొనియాడారు. ఆయన చూపించిన తెగువ పోరాటి పటిమ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 2
Latest News
24 Mar 2025 23:58:44
ఎల్ కే జి కి , ఒక లక్ష 10 వెలు ఫీజు --అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న పాఠశాలలు ,విద్య సంస్థలు
Comment List